India to Bharat: 'ఇండియా' పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

మరి రాజ్యాంగంలో ఇండియా పదాన్ని.. భారత్‌గా మార్చడం సాధ్యమేనా? సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అయినప్పటికీ పేరు మార్చాల్సిందే అనుకుంటే.. ఎన్ని మార్పులు చేయాలి? ఏమేమీ మార్చాలి? అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.

New Update
India to Bharat: 'ఇండియా' పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

India to Bharat Name Change Process: ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagawat).. ఇండియా(INDIA) పేరుకు బదులుగా భారత్‌గా అని అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ మేరకు ప్రజలు కూడా డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు మోహన్ భగవత్. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపగా.. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి (President of India) అధికారిక పత్రాల్లోనే ఇండియా బదులుగా భారత్ పేరును వాడటం సంచలనంగా మారింది. అవును మంగళవారం నాడు జీ20 అతిథులను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ఇన్విటేషన్ పంపింది. ఆ ఇన్విటేషన్ కార్డులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొని ఉంది. ఆ ఇన్విటేషన్ బయటకు రావడమే ఆలస్యం.. విపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. రాజ్యాంగంలో ఇండియా పేరును భారత్‌గా మార్చాల్సిందే అని ఓ వర్గం.. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఈ పేరును మారుస్తున్నారని మరో వర్గం ఇలా రచ్చ రచ్చ నడుస్తోంది. వీరి గోల ఇలా ఉంటే.. మరి రాజ్యాంగంలో ఇండియా పదాన్ని.. భారత్‌గా మార్చడం సాధ్యమేనా? సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అయినప్పటికీ పేరు మార్చాల్సిందే అనుకుంటే.. ఎన్ని మార్పులు చేయాలి? ఏమేమీ మార్చాలి? అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.

పేరు మార్పు సాధ్యమేనా?

కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభ, రాజ్యసభలలో స్పష్టమైన మెజారిటీ ఉంటే ఈ పేరు మార్పు పెద్ద కష్టమేమీ కాదు. ఈ బిల్లు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుగా కేబినెట్‌లో ఆమోదించి, ఆ తరువాత లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆమోదం పొందిన తరువాత బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. అక్కడి పాస్ అయితే.. రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. అది నిజరూపం దాలుస్తుంది. ప్రస్తుతం భారతదేశ రాజ్యాంగంలో ఇండియా, భారతదేశం అని పేర్కొనడం జరిగింది. ఇండియాను మార్చి, భారత్ అనే పేరు పెట్టాలని భావిస్తోంది. మరి పైన పేర్కొన్నట్లుగా ప్రాసెస్ అంతా పూర్తవడానికి టైమ్ పడుతుంది. కేబినెట్, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం లభిస్తే రాజ్యాంగంలో పేర్కొన్న ఇండియా పదం స్థానంలో భారత్ ఉంటుంది. దాని ప్రకారం.. దేశాన్ని ఇండియా బదులుగా భారత్ అని పిలవడం జరుగుతుంది.

అయితే, ప్రభుత్వం దేశానికి భారత్ అని మాత్రమే పేరు పెట్టాలని భావిస్తే.. దానికి సంబంధించిన బిల్లును తీసుకువస్తే.. ఇందులో పెద్ద కష్టమేమీ ఉండదని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని దూబే తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత జరిగే అనేక మార్పుల వల్ల కేంద్రానికి ఆర్థిక భారంతో పాటు.. సమయం కూడా పడుతుందని తెలిపారాయన.

ఇండియా పేరును భారత్‌గా మారిస్తే సాంకేతిక చేయాల్సిన మార్పులు కొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోనే కాకుండా.. ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రతులు, అన్ని అంశాలపై ఆ పేరును మార్చాల్సి ఉంటుంది. మరి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఓసారి తెలుసుకుందాం..

1. పేరును మార్చడానికి సమయం, డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే.. ఇండియా అనే పదం ఎక్కడైతే ఉపయోగించడం జరుగుతుందో అక్కడ భారత్ అని చేర్చాల్సి ఉంటుంది. అన్ని రాజ్యాంగ సంస్థలలో ఇండియాకు బదులుగా భారత్ అని రాయాల్సి వస్తుంది. అందుకే ఖర్చుతో పాటు సమయం కూడా పడుతుంది.

2. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా మారుతుంది.

3. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బదులుగా సుప్రీంకోర్ట్‌ ఆఫ్ భారత్ అవుతుంది.

4. ఈ మార్పులు గెజిట్ నోటిఫికేషన్ నుంచి ప్రతి పత్రంపై అమలు చేయాల్సి ఉంటుంది.

5. కరెన్సీ నోట్లలోనూ మార్పు చేయాల్సి ఉంటుంది. ప్రతి నోటుపై భారత్ అని ముద్ర వేయాల్సి ఉంటుంది.

6. ఇప్పుడు ఇంటర్నెట్‌లో INDIA.IN కి బదులుగా భారత్.ఇన్ అని మార్పులు చేయాల్సి ఉంటుంది.

7. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దౌత్య కార్యాలయాల్లో ఇండియా ప్లేస్‌లో భారత్‌ పేరును మార్చాల్సి ఉంటుంది.

8. ప్రభుత్వ వెబ్‌సైట్లలో Bharat.gov.in అని సరి చేయాల్సి ఉంటుంది.

ఇలా అవసరమైన ప్రతి చోట పేరును మార్చాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఇక దేశం పేరు మార్చడం కంటే కూడా రాష్ట్ర పేరు మార్చడం చాలా కష్టం. రాష్ట్ర శాసనసభ ఆమోదం, శాసన మండలి ఆమోదం ఉంటేనే దాని ఆమోదం లభిస్తుంది. అంతేకాదు.. రైల్వే, పోస్టాఫీసు సహా వివిధ శాఖల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని, ఆపై కేంద్ర కేబినెట్ ఆమోదం, రాష్ట్రం పేరు పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు తీసుకురావడం, ఆమోదించడం ద్వారా మార్చాల్సి ఉంటుంది.

Also Read:

IT Notice to Chandrababu: ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు షాక్.. రంగంలోకి సీఐడీ..!

Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..

Advertisment
తాజా కథనాలు