సింధూ నది ఉపనదైన రావి నది నీళ్లన్ని భారత్‌కు దక్కబోతున్నాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత రావి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తికావడంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహన్ని భారత్ పూర్తిగా ఆపేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఇరుదేశాల మధ్య జరిగిన సింధూ జలల ఒప్పందం జరిగింది. దీనిప్రకారం చూసుకుంటే రావి నది నీటిపై పూర్తి హక్కులు భారత్‌కు దక్కాయి. దీంతో ఆ నది నుంచి పాకిస్థాన్‌కు నీటిని ప్రవాహాన్ని ఆపేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1979లో పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.
Also Read: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!
నీటి ప్రవాహం నిలిపివేశాం
రావి నదిపై ఎగువవైపున రంజిత్ సాగర్ డ్యామ్, దిగువైపున షాపుర్ కంది బ్యారేజ్‌ను నిర్మించడానికి అప్పటికి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి షేక మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. 1982లో ఈ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1998లోనే ఇది పూర్తి కావాలి.. కాని పలు కారణాల వల్ల ఆలస్యమైంది. 2001లో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తికాగా.. షాపుర్ కంది బ్యారెజ్ ఆగిపోయింది. దీనివల్ల పాకిస్థాన్‌కు నీరు వెళ్లేది. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ తర్వాత 2013లో నిర్మాణం మొదలుపెట్టినప్పటికీ.. జమ్మూకశ్మీర్-పంజాబ్‌ల మధ్య విభేదాలు రావడంతో ఏడాదికే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక చివరికి కేంద్ర ప్రభుత్వం.. ఆ రెండు రాష్ట్రాలతో మధ్యవర్తిత్వం జరపగా 2018లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణం పూర్తికావడంతో.. పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
32 వేల హెక్టార్లలో సాగుకు నీరు
అయితే ఇన్ని సంవత్సరాల పాటు పాకిస్థాన్‌కు వెళ్లిన ఆ నీటిని ఇప్పడు జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లిస్తారు. దీంతో 32 వేల హెక్టార్లలో సాగుకు నీరు అందనుంది. అలాగే ఈ డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యూత్‌లో 20 శాతాన్ని జమ్మూకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఈ నీళ్లు ఉపయోగపడనున్నాయి. ఇదిలాఉండగా..1960లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరగగా.. ఇందులో సింధు, జీలం, చీనాబ్, నదులు పాకిస్థాన్‌కు దక్కాయి. రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి. అప్పటి ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Also Read: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్!