Independence Day 2024: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్

భారతదేశ ప్రజలందరికీ పండుగ రోజు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం.ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు ఇది.అందుకే ఈ వేడుకను పల్లె, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.ప్రతీ ఏడాదీ ఒక థీమ్‌తో పండుగ చేసుకుంటారు. ఈసారి థీమ్ కు వికసిత భారత్ అని పేరు పెట్టారు.

New Update
Independence Day 2024: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్

Viksit Bharat: ఆగస్టు 15 భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందిన ఈరోజును ప్రతీ భారతీయుడు గర్వంగా పండుగల జరుపుకుంటాడు. ప్రస్తుతం మనం శతాబ్ది స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న భారత్‌ను.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించే విధంగా తీర్చిదిద్దాలని ప్రస్తుత ప్రధాని మోదీ (PM Modi) సంకల్పించారు. దీనికి వీక్షిత్ లేదా వికసిత భారత్ అని పేరు పెట్టారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ కు కూడా వీక్షిత్ భారత్ అని నామకరణం చేశారు.

1947 ఆగస్టు 15న (August 15) భారతదేశం అధికారికంగా స్వేచ్ఛను పొందింది. ఇదే రోజు భారత్, పాకిస్తాన్‌లు రెండు దేశాలుగా కూడా విభజించబడ్డాయి. ఇందులో ఇండియా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో మన భారత్ ఒకటి. న్యాయం, స్వేచ్ఛ సూత్రాల ప్రాతిపదికన..ప్రజల కొరకు, ప్రజలచే, ప్రజల కోసం ఏర్పడ్డ దేశంగా రూపొందింది. జాతీయ స్వేచ్చ, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.


దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీషర్ల చెరలోనే మగ్గిపోయి..ఆ అణిచివేత నుండి పుట్టుకొచ్చిన భారతీయుడి ఆవేశం ప్రతిఫలమే నేటి ఈ స్వేచ్ఛ. ఆ ఆవేశమే ఆగ్రహ జ్వాలగా మారి చివరకు సిపాయిల తిరుగుబాటుగా క్విట్ ఇండియా ఉద్యమంగా రూపు దాల్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి ఒక్క భారతీయుడు పండుగలా నిర్వహించుకోవాల్సిన రోజు. దీని కోసం ఎందరో అమర వీరులు తమ ప్రాణాలను అర్పించారు. ఇందులో మన
తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక ప్రతీ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎర్రకోట మీద నిర్వహించు కోవడం మొదట నుంచి ఆనవాయితీగా మారింది. ఈరోజు దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేసి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి మూడోసారి ప్రధానిగా ఎన్నికయిన మోదీ 11వ వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. తరువా ఈ థీమ్ అయిన వికసిత్ భారత్ లేదా వీక్షిత్ భారత్‌నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

Also Read:Kolkata: కోలకత్తా డాక్టర్ రేప్..అర్ధరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు 

Advertisment
తాజా కథనాలు