India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది.

India-Canada: కెనడా పౌరులకు వీసా సేవలు పునరుద్ధరణ.. ఎప్పటినుంచంటే
New Update

భారత్‌, కెనడా మధ్య రాజుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మళ్లీ హీటెక్కాయి. భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూఢిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే.. ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ స్పందనను తెలియజేసింది. కెనడాకు దీటుగా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.చట్టాలకు అనుగుణంగానే తాము.. ఒట్టవాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచనలు చేసినట్లు పేర్కొంది. ఇక భారత్‌లో 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించామని కూడా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మరోసారి ఇండియాపై ఆరోపణలు చేశారు. భారత్‌లోని దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే.. అదనంగా ఉన్న వారికి దౌత్యపరంగా ఉన్నటువంటి రక్షణ తొలగిస్తామని ఢిల్లీ చెప్పింది.ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయమని.. అలాగే దౌత్య సంబంధాల కోసం ఏర్పరుచుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని మోలానీ ఆరోపణలు చేశారు.

అయితే ఈ అంశంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. కెనడా ఆరోపణలను తిప్పికొట్టింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది. ఈ విషయం గురించి గత నెలరోజులుగా కెనడాతో చర్చలు జరిపామని.. అలాగే వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగూణంగానే.. దౌత్య సిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ (MEA).. కెనడా ఆరోపణలను తిప్పికొడుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను చూశాం. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక, మన అంతర్గత వ్యవహారాల్లో వారు తరచూ జోక్యం చేసుకుంటున్నారు. న్యూదిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమానత్వ అమలును.. నిబంధనల ఉల్లంఘనగా చేసే ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కొన్ని రోజుల క్రితం కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాత్రం భారత్‌ తీవ్రంగా ఖండించింది. అలాగే భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు ఎక్కవగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించింది. ఇక దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలని సూచనలు చేసింది. ఈ క్రమంలోనే భారత్‌లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూఢిల్లీ అల్టిమేటం జారీ చేసింది.దీంతో భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది.

#canada-diplomatic-row #canada-india-tensions #canada-india-relations #international-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe