India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది.
/rtv/media/media_library/e51206e5311e5a1b6b2584179077611283fc201a27d01a4b64b50d6b9a69e9f8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/India-Canada-Flag-jpg.webp)