దాదాపు 2 నెలల తరువాత...కెనడా ఈ - వీసా సేవలు పునరుద్దరణ!

ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్‌ హత్య తరువాత కెనడీయన్‌ వీసాలను భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 నెలల తరువాత వీసాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

New Update
దాదాపు 2 నెలల తరువాత...కెనడా ఈ - వీసా సేవలు పునరుద్దరణ!

కెనడాలో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య తరువాత కెనడా ప్రధాని భారత్‌ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ వివాదం కాస్త ఇరు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.

దీనికి సమాధానంగా భారత్‌ కూడా తీవ్రంగానే స్పందించింది. భారత్‌ నుంచి వెంటనే కెనడియన్‌ దౌత్యవేత్తను తిరిగి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా కెనడియన్స్‌ కు వీసాలను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రెండు నెలల తరువాత మళ్లీ కెనడియన్స్‌ కు ఈ - వీసా సేవల్ని భారత్‌ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

దౌత్య పరమైన వివాదం నేపథ్యంలో సెప్టెంబర్‌ మూడో వారం నుంచి వీసా సేవలను నిలిపివేశారు. టూరిస్ట్‌ వీసాలతో సహా అన్ని వీసా సేవల్ని ప్రస్తుతం తిరిగి పునరుద్దరించనుంది. బిజినెస్‌, మెడికల్‌ వీసాలు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ నెలలో తరువాత నోటీసులు వచ్చే వరకు వీసాలు నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడం వివాదానికి దారి తీసింది.

ఈ విషయం గురించి కెనడా తన మిత్ర దేశాలతో కలిసి భారత్‌ మీద ఒత్తిడి తీసుకుని రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ..కెనడా ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు కెనడా సమర్పించలేదని వెల్లడించారు.

దీంతో రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ నిలిచిపోవడానికి కారణమైంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్‌ని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత ప్రభుత్వం 2020లో అధికారికంగా నిజ్జర్‌ని ఉగ్రవాదిగా ప్రకటించింది.

Also read: 38 లక్షల పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందంటే!!

Advertisment
Advertisment
తాజా కథనాలు