Asia Cup 2023 final Live Score🔴: ఆసియా కప్‌ 2023 విజేత భారత్

ఆసియా కప్‌ 2023 టైటిల్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్‌ కోసం భారత్‌-శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో శ్రీలంక పై గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా.. సొంత గడ్డపై ఫైనల్‌ ఫైట్‌ జరుగుతుండటం లంక జట్టుకు కలిసి వచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్‌ టైటిల్‌ను గెలుపొందిన ఉత్సాహంతో వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆడుగుపెట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి.

Asia Cup 2023 final Live Score🔴: ఆసియా కప్‌ 2023 విజేత భారత్
New Update

ఆసియా కప్‌ 2023 టైటిల్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్‌ కోసం భారత్‌-శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో శ్రీలంక పై గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా.. సొంత గడ్డపై ఫైనల్‌ ఫైట్‌ జరుగుతుండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్‌ టైటిల్‌ను గెలుపొందిన ఉత్సాహంతో వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆడుగుపెట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉన్నట్లు అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు.

మరోవైపు భారత్‌- శ్రీలంక టీమ్‌లను పరిశీలిస్తే టైటిల్‌ గెలిచే అవకాశాలు అధికంగా భారత్‌ ఉన్నట్లు పలువురు మాజీలు అంటున్నారు. బ్యాటర్లు, బౌలర్లతో భారత్‌ జట్టు పటిష్టంగా ఉందన్నారు. టీమిండియా ఆల్‌రౌండ్‌షో చేస్తే ఈ ఏడాది ఆసియా కప్‌ టైటిల్‌ గెలిచుకునే అవకాశాలు ఉన్నాయని మాజీలు స్పష్టం చేశారు.

  • Sep 17, 2023 18:09 IST
    ఆసియా కప్‌ 2023 విజేత భారత్

    ఆసియా కప్‌ 2023 విన్నర్‌ భారత్‌ అవతరించింది, శ్రీలంతో జరిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక భారత బౌలర్ల దాటికి 50 పరుగులు మాత్రమే చేయగా.. అనంతరం 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు 6.1 ఓవర్లోనే లక్ష్యాన్ని చేధించింది.

  • Sep 17, 2023 18:06 IST
    స్కోర్‌లు సమం

    శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లు స్పనర్‌ బౌలింగ్‌లో ఆచూతూచి ఆడుతున్నారు. వెల్లలాగే వేసిన 6 ఓవర్‌లో అఖరి బంతిని బౌండరీకి తరలించిన గిల్‌ స్కోర్‌ను సమం చేశాడు.

  • Sep 17, 2023 18:04 IST
    గిల్‌ బౌండరీల మోత.. మరో 6 పరుగుల దూరంలో భారత్‌

    శుభ్‌మన్‌ గిల్‌ స్టేడియంలో బౌండరీల మోత మోగిస్తున్నాడు. పతిరాన వేసిన 5 ఓవర్‌లో మొదటి బంతిని బౌండరీకి తరలించిన గిల్‌.. ఆ తర్వాత సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. లాస్ట్‌ బాల్‌ను బౌండరీకి తరలించాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. గెలపుకోసం మరో 6 పరుగులు మాత్రమే చేయాలి

  • Sep 17, 2023 17:56 IST
    ధాటిగా బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్

    టీమిండియా ఓపెనర్లు చెలరేగి పోతున్నారు. ఇషాన్‌ కిషన్, శుభ్ మన్‌ గిల్‌లు ప్రతీ బాల్‌ని బౌంరీకి తరలించాలనే కలిసి ఆడుతున్నారు. 51 పరుగుల లక్ష్యాన్నిమొదటి పవర్‌ ప్లేలోనే చేధించాలని చూస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌ వరుస బౌంరీలు బాధుతుండటంతో ముడు ఓవర్లు పూర్తి అయ్యే సరికి టీమ్‌ ఇండియా వికెట్‌ నష్ట పోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ 13, గిల్‌ 18 పరుగులతో క్రీజులొ ఉన్నారు.

  • Sep 17, 2023 17:49 IST
    హైదరాబాదీ పేసర్‌ ధాటికి కుప్పకూలిన శ్రీలంక

    ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌ శ్రీలంక బ్యాటర్లలో మెండీస్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశాయగా మిగతా బ్యాటర్లు వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఐదుగురు డకౌట్‌గా కావడం విశేషం. మరోవైపు భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అంతర్జాతీ క్రికెట్‌లో తన అత్యధిక గణాంకాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లతో చెలరేగగా, హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్‌ పడగొట్టాడు.

    మ్యాచ్‌ ఆరంభంలో బూమ్రా మొదటి వికెట్‌ తీయడంతో శ్రీలంక పథనం ప్రారంభమైంది. బుమ్రా అనంరతం మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. దీంతో లంక బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే ఫెవీలియన్‌ చేరుతుండటంతో శ్రీలంక టీమ్‌ పీకల్లతో కష్టాల్లో పడింది. ఆసమయంలో బ్యాటింగ్‌ వచ్చిన ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి 21 పరుగులు చోడించాడు. అనంతరం ఈ జోడీని ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యా విడదీశాడు. ఏడో వికెట్‌ కోల్పోయిన అనంతరం మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.

    మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్థిని 50 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో కొత్త రికార్డును సృష్టించింది. ఐసీసీ ర్యాంకింగుల్లో టాప్‌ 8 టీమ్‌లో ఒకటైన జట్టును కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమ్‌గా భారత్‌ నిలిచింది. కాగా మహేలా జయవర్దన. సనత్‌ జయసూర్య, కుమార సంగకార వంటి మేటి క్రికెటర్లు ఆడిన టీమ్‌ వన్డే ఫార్మాట్‌లో ఇలా తక్కువ పరుగులు చేయడంతో చెత్త రికార్డును సృష్టిచుకుంది. వన్డే ఫార్మాట్లో లంక టీమ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ ఇంత తక్కువ స్కోర్‌ చేయలేదు. అలాంటి టీమ్‌ను భారత జట్టు అత్యంత అత్యల్ప స్కోర్‌ కే పరిమితం చేయడం విశేషం

  • Sep 17, 2023 17:42 IST
    చెలరేగిన భారత బౌలర్లు.. అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన లంక

    ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌ శ్రీలంక బ్యాటర్లలో మెండీస్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశాయగా మిగతా బ్యాటర్లు వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఐదుగురు డకౌట్‌గా కావడం విశేషం. మరోవైపు భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అంతర్జాతీ క్రికెట్‌లో తన అత్యధిక గణాంకాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లతో చెలరేగగా, హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్‌ పడగొట్టాడు.  

    మ్యాచ్‌ ఆరంభంలో బూమ్రా మొదటి వికెట్‌ తీయడంతో శ్రీలంక పథనం ప్రారంభమైంది. బుమ్రా అనంరతం మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. దీంతో లంక బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే ఫెవీలియన్‌ చేరుతుండటంతో శ్రీలంక టీమ్‌ పీకల్లతో కష్టాల్లో పడింది. ఆసమయంలో బ్యాటింగ్‌ వచ్చిన ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి 21 పరుగులు చోడించాడు. అనంతరం ఈ జోడీని ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యా విడదీశాడు. ఏడో వికెట్‌ కోల్పోయిన అనంతరం మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.

    మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్థిని 50 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో కొత్త రికార్డును సృష్టించింది. ఐసీసీ ర్యాంకింగుల్లో టాప్‌ 8 టీమ్‌లో ఒకటైన జట్టును కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమ్‌గా భారత్‌ నిలిచింది. కాగా మహేలా జయవర్దన. సనత్‌ జయసూర్య, కుమార సంగకార వంటి మేటి క్రికెటర్లు ఆడిన టీమ్‌ వన్డే ఫార్మాట్‌లో ఇలా తక్కువ పరుగులు చేయడంతో చెత్త రికార్డును సృష్టిచుకుంది. వన్డే ఫార్మాట్లో లంక టీమ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ ఇంత తక్కువ స్కోర్‌ చేయలేదు. అలాంటి టీమ్‌ను భారత జట్టు అత్యంత అత్యల్ప స్కోర్‌ కే పరిమితం చేయడం విశేషం

  • Sep 17, 2023 17:15 IST
    శ్రీలంక ఆలౌట్‌@50

    శ్రీలంక టీమ్‌ 50 పరుగలకే చాప చుట్టేసింది. మధుషన్‌ అవుటైన అనంరతం క్రీజులోకి వచ్చిన మతీషా తన మొదటి బాల్‌కే ఇసాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనెదిరిగాడు. దీంతో శ్రీలంక 50 పరుగుల మాత్రమే చేయగలిగింది.

  • Sep 17, 2023 17:11 IST
    9వ వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

    శ్రీలంక మరో వికెట్‌ను కోల్పోయింది. హర్డిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్‌లో మధుషన్‌ స్లిప్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెను దిరిగాడు. దీంతో లంక టీమ్ 15.1 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది

  • Sep 17, 2023 17:07 IST
    15వ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే

    భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 15 ఓవర్‌లో స్పిన్నర్‌కు బాల్‌ ఇచ్చాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఈ ఓవర్‌లో లంక టీమ్‌ ఒకే ఒక్క పరుగు చేసింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి లంక టీమ్‌ 50 పరుగులు చేసింది.

  • Sep 17, 2023 17:04 IST
    ఎదురీదుతున్న లంక

    మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులకు శ్రీలంక లోయరార్డర్‌ కుదేలవుతోంది. సిరాజ్‌ బౌలింగ్‌లో లంక బ్యాటర్లు మధుషన్, హేమంత పరుగులు చేయాలంటేను భయపడుతున్నారు. మరోవైపు ఈ ఓవర్లో విరాట్‌ కోహ్లీ అనవసర త్రో వల్ల టీమిండియా లంకకు 4 పరగులు సమర్పించుకుంది. కాగా శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది

  • Sep 17, 2023 16:55 IST
    హార్డిక్ పాండ్యాకు వికెట్‌

    శ్రీలంక మరో వికెట్‌ కోల్పొయింది. హర్డిక్ పాండ్యా వేసిన 12.3 బంతిని వెల్లలాగే కీపర్‌ మీదుగా బ్యాక్‌ సైడ్‌ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో శ్రీలంక టీమ్‌ 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 12.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి శ్రీలంక టీమ్‌ 40 పరుగులు చేసింది. వెల్లలాగే వెనుదిరగడంతో మధషన్‌ క్రీజులోకి వచ్చాడు.

  • Sep 17, 2023 16:48 IST
    మరో వికెట్‌ కోల్పొయిన శ్రీలంక

    మహ్మద్‌ సిరాజ్‌ తన వికెట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. సిరాజ్‌ వేసిన 11.2 బంతికి శ్రీలంక మరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో సిరాజ్‌ తన 6వ వికెట్‌ను తీసుకున్నాడు. మెండీస్‌ 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక టీమ్‌ 7 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.

  • Sep 17, 2023 16:43 IST
    తడబడుతున్న లంక బ్యాటర్లు

    పవర్‌ ప్లే ముగియడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యాకు బంతినిచ్చాడు. పాండ్యా బౌలింగ్‌లో సైతం లంక బ్యాటర్లు తడబడుతున్నారు. రన్స్‌ చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. 11వ ఓవర్‌లో మొదటి 5 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని లంక బ్యాటర్లు చివరి బ్యాట్‌ మాత్రం 2 పరుగులు రాబట్టారు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి లంక్ టీమ్‌ 33 పరుగులు చేసింది.

  • Sep 17, 2023 16:39 IST
    10వ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే

    మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. సిరాజ్‌ వేసిన 10వ ఓవర్ల లంక బ్యాటర్లు ఒక్క పరుగు మాత్రమే చేయగలిగారు. దీంతో మొదటి పవర్‌ ప్లే ముగిసే సరికి లంక టీమ్‌ 6 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

  • Sep 17, 2023 16:34 IST
    9వ ఓవర్‌లో రెండు ఫోర్‌లు

    ఎట్టకేలకు శ్రీలంక టీమ్‌ బౌండరీలు రాబట్టగలుగుతోంది. బుమ్రా వేసిన 9 ఓవర్లో మెండీస్‌ రెండు ఫోర్లు రాబట్టగలిగాడు. దీంతో లంక టీమ్ 9 ఓవర్లో 12 పరుగులు చేసింది. దీంతో లంక టీమ్‌ 9 ఓవర్లు ముగిసే సరిగి 6 నష్టానికి 30 పరుగులు చేసింది

  • Sep 17, 2023 16:29 IST
    పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక

    మొదటి పవర్‌ ప్లే పూర్తి కాకముందే శ్రీలంక టీమ్‌ సగానికి పైగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 8 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన లంక టీమ్‌ 6 వికెట్ల నష్టానికి 18 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌ తీసిన 6 వికెట్లలో మహ్మద్‌ సిరాజ్‌ 5 వికెట్లు తీసుకోవడం విశేషం.

  • Sep 17, 2023 16:20 IST
    5 వికెట్లు తీసుకున్న సిరాజ్

    హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సీరాజ్‌ చెలరేగిపోతున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరో వికెట్‌ తీసుకున్నాడు. శ్రీలంక కెప్టెన్‌ శనక సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో శ్రీలంక టీమ్‌ 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పొయింది. శనక డకౌట్‌గా వెనుదిరగగా.. మహ్మద్‌ సిరాజ్‌ ఇప్పటి వరకు 5 వికెట్ల తీసుకున్నాడు.

  • Sep 17, 2023 16:12 IST
    ఒకే ఓవర్‌లో 4 కీలక వికెట్లు డౌన్

    మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 4వ ఓవర్లో శ్రీలంక 1 కాదు 2 కాదు ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌ భారత బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ శ్రీలంక బ్యాటర్లు నిస్సంకా, సదీర, అసలంక, డిసిల్వల వికెట్లను తీసుకున్నాడు. దీంతో ఓకే ఓవర్‌లో 4 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా మహ్మద్‌ సిరాజ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

  • Sep 17, 2023 16:07 IST
    4వ వికెట్‌ డౌట్‌

    శ్రీలంక వరస బంతుల్లో వికెట్లు కోల్పోతుంది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఓవర్లో వరుస బంతుల్లో శ్రీలంక బ్య్యాటర్లు సదీర, అసలంక వెనుదిగారు. దీంతో మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు.

  • Sep 17, 2023 16:02 IST
    మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

    శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతుంది. నిస్సంకా వెదిరిగిన వెంటనే క్రీజులోకి వచ్చిన సదీర డకౌట్‌గా వెనుదికగాడు. దీంతో మహ్మద్‌ సిరాజ్ ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు.

  • Sep 17, 2023 15:59 IST
    రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

    శ్రీలంక మరో వికెట్‌ కోల్పోయింది సిరాజ్‌ వేసిన 4వ ఓవర్‌ మొదట బంతిని నిస్సంకా బౌండరీకి తరలించేదుకు భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ రవీంద్ర జడేజా అద్భతమైన క్యాచ్‌తో నిస్సంకా (2) ను ఫెవిలీన్‌ పంపాడు. కాగా క్రీజులోకి సదీర వచ్చాడు.

  • Sep 17, 2023 15:52 IST
    సిరాజ్‌ ఓవర్‌లో నో రన్స్‌

    హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు తడపడుతున్నారు. స్వింగ్‌ అవుతుంటూ వస్తున్న బంతులను మెండీస్‌, నిసంకా ఎదుర్కోలేక పోతున్నారు. సిరాజ్‌ వేసిన ఓవర్‌లో లంక బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.

  • Sep 17, 2023 15:48 IST
    మొదటి ఓవర్లో 7 పరుగులు

    ఆసియా కప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరేరా, నిసంకా క్రీజులోకి రాగా భారత రేసుగుర్రం బుమ్రా ఫస్ట్‌ ఓవర్‌ వేశాడు. బమ్రా తన మొదటి ఓవర్‌లోనే పెరేరా వికెట్‌ తీసుకున్నాడు. పెరేరా కీపర్‌ కేఎల్‌ కాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరగాడు. కాగా ఈ ఓవర్లో శ్రీలంక వికెట్‌ నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులోకి మొండీస్‌ వచ్చాడు

  • Sep 17, 2023 15:45 IST
    మొదటి ఓవర్లోనే శ్రీలంక వికెట్‌ డౌన్

    ఆసియా కప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరేరా, నిసంకా క్రీజులోకి రాగా భారత రేసుగుర్రం బుమ్రా ఫస్ట్‌ ఓవర్‌ వేశాడు. బమ్రా తన మొదటి ఓవర్‌లోనే పెరేరా వికెట్‌ తీసుకున్నాడు. పెరేరా కీపర్‌ కేఎల్‌ కాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరగాడు.

  • Sep 17, 2023 15:33 IST
    250వ వన్డే మ్యాచ్‌ ఆడబోతున్న కెప్టెన్

    ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ ద్వారా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 250వ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. తన 250వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు

  • Sep 17, 2023 14:52 IST
    స్టార్‌లు రీఎంట్రీ

    ఫైనల్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే టీమిండియాను పరిశీలిస్తే.. టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది.

#rohit-sharma #dasun-shanaka #final #sri-lanka #asia-cup #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి