కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ప్రధాని మోదీ.. ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసినవారికి మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు.
Also Read: పవన్‌కు ఆరు పవర్‌ఫుల్ శాఖలు.. ఏరికోరి ఎంచుకున్న జనసేనానీ
ఈసారి కూడా కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలాసీతారామన్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే పార్లమెంటులో ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు. జులైలో నిర్మలాసీతారామన్ కేంద్ర పద్దులు ప్రవేశపెడితే వరుసగా ఏడుసార్లు బడ్జెట్ విడుదల చేసిన మంత్రిగా సరికొత్త రికార్డు సృష్టిస్తారు.