Pawan Kalyan: భారత్‌లో జీ20 సదస్సు నిర్వహించడం గర్వకారణం

భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

New Update
విశాఖ షిప్పింగ్ హార్బర్‌ బాధితులకు అండగా జనసేనాని.!

Pawan Kalyan About G20 Summit: భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. భారతదేశం పురోగమిస్తోందని, దానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. జీ20 సమ్మిట్‌ (G20 Summit)లో భారత్‌ అగ్ర రాజ్యాలతో బలమైన బంధాన్ని ఏర్పడుచుకుందన్న ఆయన.. అందుకు నిరంతరం కృషి చేసిన ప్రధాని మోడీకి (PM Modi) ధన్యవాదాలు తెలిపారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో (Joe Biden) పాటు పలు దేశాలకు చెందిన ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ జీ20 సమావేశంలో భాగంగా వివిధ దేశాధినేతలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్‌ మొదటి సారి జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్నందుకు పవన్‌ కళ్యాణ్‌ అనందం వ్యక్తం చేశారు.

భారత్‌లో జరిగిన జీ20 సదస్సు ముగింపు వేడుకల్లో బ్రెజిల్‌ జీ20 కూటమి సారధ్యతలను స్వీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్‌ (Brazil) అధ్యక్షుడు లూయీ ఇనాసియో లులా డసిల్వాకు (Luiz Inacio Lula da Silva) ఈ దండాన్ని అప్పగించారు. మరోవైపు భారత్‌ నేతృత్వంలో జీ20 సమావేశాలు జరుగడం ఇదే మొదటి సారి. దీంతో ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, మిత్ర దేశాలకు చెందిన ప్రతినిధులు రానుండటంతో మొదట కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిథులు వచ్చి వెళ్లేంత వరకు వారు ఉండే హోటల్స్‌, పర్యటించే ప్రాంతాల్లో పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.

ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రపంచ శాంతికి సంస్కృత శ్లోకాన్ని పఠించారు. ప్రపంచ శాంతి కోసం ప్రతీ దేశం సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోందని, మరికొన్ని దేశాల్లో ఉద్రిక్త వాతావరణాలు ఉన్నట్లు జీ20 శిఖరాగ్ర సదస్సులో చర్చించారు. ఈ సమస్యలను పరిష్కరించి ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేలా వివిధ దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా 2024లో జీ20 సదస్సు రియో డీ జనీరో (Rio de Janeiro)లో జరుగనుంది.

Also Read: ప్రపంచమంతా భారత్‎కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!

Advertisment
తాజా కథనాలు