World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనా 6.6% ఉంటుందని అభిప్రాయపడింది.వస్తు తయారీ, రియల్ ఎస్టేట్‌లో మరింత డెవలప్‌మెంట్ ఉంటుందని చెప్పింది. By Manogna alamuru 12 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్‌ది అని వరల్డ్‌బ్యాంక్ అంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు భారత జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ప్రస్తుత దాని మీద 20 బేసిస్ పాయింట్లు పెంచి వృద్ధిని 6.6 శాతానికి పెంచింది. దీనిబట్టి తమ అంచనాలను వెల్లడించింది. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ వేగం ఓ మోస్తరుగా ఉంటుందని చెప్పింది. ప్రపంచ బ్యాంక్ 2024-25 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.7% వార్షిక వృద్ధిని అంచనా వేసింది. 2024లో దక్షిణాసియాలో మొత్తం వృద్ధి రేటు 6.0 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తన కొత్త దక్షిణాసియా ఆర్థిక వృద్ధి అంచనాలో పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి 2024 వరకు GDP వృద్ధి 7.8%గా ఉంది. అదే సమయంలో.. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో అంటే, Q4FY23, GDP వృద్ధి 6.1%గా నమోదైంది. FY24లో GDP వృద్ధి 8.2%. గత ఆర్థిక సంవత్సరం అంటే FY23లో GDP వృద్ధి 7%. అదే సమయంలో FY24 యొక్క GDP వృద్ధి రిజర్వ్ బ్యాంక్ అంచనా 7% కంటే 1.2% ఎక్కువగా అంచనా వేసింది. Also Read:Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే #india #world-bank #gdp #devolepment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి