/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T204802.582.jpg)
India : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ (Ebrahim Raisi) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 సంతాప దినం (Mourning Day) పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం మంగళవారం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇదిలాఉండగా.. 1989లో ఇరాన్ అగ్ర నేత అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో కూడా భారత్ 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.