India-China Talks: దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు జరగనున్న భారత్-చైనా కమాండర్ స్థాయి చర్చలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తూర్పు లడఖ్‌లోని చుషుల్ సరిహద్దు సమావేశ పాయింట్లో చర్చలు జరగనున్నాయి. ఇందులో ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారులు పాల్గొంటారు. జూన్ 2020లో గాల్వన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఇది 19వ సమావేశం. అయితే ఇప్పటివరకు జరిగిన ఏ సమావేశం, చర్చలు సఫలం కాలేదు.
పూర్తిగా చదవండి..India-China : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఇండియా చైనా చర్చలు.. ఎందుకంటే..!!
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలకు రెండు సైన్యాల కమాండర్ స్థాయి అధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తూర్పు లడాఖ్ లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగవంతం చేయాలని భారత్ స్పష్టం చేయనుంది.
Translate this News: