Bihar: బీహార్‌లో తేలిన కూటమి సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్

బీహార్లో కూటమి సీట్ల పంపకం అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. మొత్తం 40 స్థానాల్లో 26 ఆర్జేడీ, 9 కాంగ్రెస్ మిగిలిన ఐదు స్థానాల్లో వామపక్షాలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
Bihar: బీహార్‌లో తేలిన కూటమి సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్

Bihar Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి కూడా. ఈ నేపథ్యంలో బీహార్‌లో కూటమి (INDIA Alliance) నుంచి ఏ పార్టీ నుంచి ఎంత మంది అభ్యర్ధులు పోటీ చేయాలనే విషయాన్ని ఖరారు చేశారు. ఆర్జేడీ (RJD), కాంగ్రెస్ (Congress), లెఫ్ట్ పార్టీ మధ్య సీట్ల లెక్క తేలింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాల్లో అర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల బరిలో దిగనున్నారు.

కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు...

బీహార్‌లోని కథియార్‌, కిషన్‌ గంజ్‌, పట్నా సాహిబ్‌, ససారాం, భాగల్‌పూర్‌, వెస్ట్‌ చంపారన్‌, ముజఫర్‌పూర్‌, సమస్తిపూర్‌, మహరాజ్‌ గంజ్‌ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. బెగుసరాయ్‌, ఖగారియా, అర్హ్‌, కరకట్‌, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు పోటీలోకి దిగుతారు.

ఇక బీహార్‌లో మొత్తం అన్ని స్థానాలకు కలిపి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19, 26, మే 7, 13, 20, 25, జూన్‌ 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక గత ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ మెజారిటీ సాధించింది. బీజేపీకి 17, జేడీయూ 16, ఎల్‌జేపీ 6 స్థానాల్లో గెలుపొందాయి. అప్పుడు కాంగ్రెస్ ఒక స్థానం దక్కించుకోగా...ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలకు ఒక్క చోట కూడా గెలవలేకపోయాయి.

Also Read:Telangana:దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్..

Advertisment
తాజా కథనాలు