బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో.. ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలకంగా మారారు. మరోవైపు ఎన్డీయే మిత్రపక్షాలను కలుపుకొని అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌కు గాలం వేస్తోంది ఇండియా కూటమి.
Also read: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చంద్రబాబుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే 5 కేబినేట్ మంత్రి మంత్రులు, స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్‌తో సంప్రదింపులు జరపాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబుతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Also read: ఎల్లుండి మరోసారి ఎన్డీయే కూటమి సమావేశం..