CM Nitish Kumar : ఇండియా కూటమి వ్యూహం.. సీఎంకు బంపర్ ఆఫర్!

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్‌కు ఇండియా కూటమి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఉప ప్రధాన మంత్రి పదవి ఇస్తామని నితీష్ కుమార్ కు ఇండియా కూటమి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
CM Nitish Kumar : ఇండియా కూటమి వ్యూహం.. సీఎంకు బంపర్ ఆఫర్!

INDIA Alliance : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త సంచలనంగా మారింది. బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) కి ఇండియా కూటమి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తమకు మద్దతు ప్రకటిస్తే ఉప ప్రధాన మంత్రి పదవి ఇస్తామని నితీష్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం అయ్యి బీజేపీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కాదని నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.

publive-image

Also Read : గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్‌ బ్యాక్‌.. ఏకంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు