Independence Day: బంపర్‌ డీల్స్‌..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్‌ చేసుకోవద్దు బ్రదర్!

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్, మోటోరోలా, గూగుల్‌ పిక్సల్‌, సోని హోం థియేటర్‌, వన్‌ప్లాస్‌ నార్డ్‌-3పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. భారీ తగ్గింపులతో గ్యాడ్జెట్లపై హాట్‌ డీల్స్‌ నడుస్తున్నాయి.

New Update
Independence Day: బంపర్‌ డీల్స్‌..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్‌ చేసుకోవద్దు బ్రదర్!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక ఇ-కామర్స్ సంస్థలు, ఆన్‌లైన్ రిటైలర్‌లు గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు సహా తాజా గాడ్జెట్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు, తగ్గింపులను ప్రారంభించాయి. విజయ్ సేల్స్ అండ్‌ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొన్ని బెస్ట్ స్వాతంత్ర్య దినోత్సవ డీల్స్‌పై ఓ లుక్కేయండి.

publive-image
ఐఫోన్ 14:
రూ. 69,900

విజయ్ సేల్ మెగా ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా, 128 GB స్టోరేజ్‌తో ఐఫోన్‌-14( iPhone 14)ను రూ.69,900కి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా HDFC కార్డ్ వినియోగదారులకు రూ. రూ.4,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది, అలాగే పాతఫోన్‌ను రిప్లేస్‌ చేసుకుంటే రూ. 8,000 క్రెడిట్‌ను అందిస్తోంది. అప్పుడు ఐఫోన్‌-14 ధరను కేవలం రూ. 42,900లే అవుతుంది.

publive-image

Apple iPad (9th gen)
రూ. 27,990

మెగా ఫ్రీడమ్ సేల్ సమయంలో, బేస్‌లైన్ యాపిల్ ఐప్యాడ్‌( Apple iPad) 9th జెనరేషన్‌.. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ. 27,990కి అందుబాటులో ఉంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంటుంది. పోర్ట్‌ను కలిగి ఉండి యాపిల్‌ నుంచి వచ్చిన చివరి ఐప్యాడ్ ఇది. ఇక ఇది 64 GB ఇంటర్నెల్ స్టోరేజీని కూడా అందిస్తుంది.

publive-image

Motorola G14
రూ. 9,999

కొత్త మోటోరోలా(Motorola G14) ఇప్పుడు బిగ్ బచత్ ధమాల్ సేల్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ మోటో (Moto G14) స్మార్ట్‌ఫోన్ స్టీల్ గ్రే, స్కై బ్లూ కలర్లలో అందుబాటులో ఉంటుంది. మోటో జీ13 (Moto G13) తర్వాత వచ్చిన మోటో జీ14 ఫ్లాట్ ప్రైమ్ డిజైన్‌లో ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది. ఇది 405ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. మోటో జీ14 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ప్యానెల్‌లో క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ బరువు 177 గ్రాములు.

publive-image

Google Pixel 6a
రూ. 26,999

గూగుల్ పిక్సెల్ 6 ఏ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 26,999 డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛెంజ్‌ బెనిఫిట్స్ అదనంగా ఉంటాయి. ఈ ఫోన్‌లో మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ బ్లూ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. Pixel 6aలో స్టిల్ ఫొటోగ్రఫీ ఫీచర్స్ రాత్రివేళలో కూడా స్పష్టమైన ఫొటోలు తీయగలదు.

publive-image

Sony HT-S20R 5.1-ch హోమ్ థియేటర్
రూ. 15,990

సోని కంపెనీకి చెందిన తాజా HT-S20R ఇప్పుడు 20 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. 5.1-ఛానల్ స్పీకర్ సిస్టమ్‌తో పాటు స్పీకర్ సెటప్ బ్లూటూత్‌కు సపోర్ట్ ఇస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల నుంచి నేరుగా మ్యూజిక్‌ని ఈ సిస్టమ్ ద్వారా వినవచ్చు.

publive-image

OnePlus Nord 3
రూ. 32,999
వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ. 32,999 డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛెంజ్‌ బోనస్ అదనంగా ఉంటుంది. OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరాతో కలిపి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

Advertisment
తాజా కథనాలు