దక్షిణాఫ్రికా(SouthAfrica)తో టెస్టు సిరీస్ రేపు(డిసెంబర్ 26న) మొదలుకానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సఫారీలపై ఇండియా తన తొలి మ్యాచ్ సెంచూరియన్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ టెస్టు జట్టు కొత్తగా కనిపిస్తోంది. గతంలో ఉన్న సీనియర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా పుజారా లేకుండా ఇండియన్ టీమ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్‌తో పాటు వన్ డౌన్‌లో గిల్ ఎలా ఆడుతాడన్నది ఆసక్తిగా మారింది. ఇక త్రీ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఎలా రాణిస్తాడో చూడాలి. రషబ్ పంత్ మరి కొన్ని నెలల్లో జట్టుతో కలిసే అవకాశాలు ఉంటాయి. అతను తిరిగి వస్తే రాహుల్ లేదా అయ్యర్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బౌలింగ్‌లో ఈసారి టీమిండియా స్టార్ పేసర్ షమీ లేకుండానే బరిలోకి దగుతోంది. ఇది మైనస్.
అతను లేకపోవడం లోటే:
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ షమీ జట్టులో లేకపోవడం లోటేనని చెప్పుకొచ్చాడు. 'చాలా ముఖ్యమైన టెస్ట్ సిరీస్. మేము ఇక్కడ(దక్షిణాఫ్రికా) ఎప్పుడూ సిరీస్ గెలవలేదు. ఇది మాకు పెద్ద అవకాశం. మేము గత రెండు సార్లు సిరీస్ విజయానికి దగ్గర వరకు వచ్చాం. అది మా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి మాకు చాలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆస్ట్రేలియాలో మా సీమర్లు బాగా రాణించారు. నిజానికి షమీని మిస్ అవుతాం' అని రోహిత్ అన్నాడు.
దక్షిణాఫ్రికతో తొలి టెస్టు డిసెంబర్ 26న జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే గాయంతో షమీ బాధపడుతున్నాడు. నిజానికి షమీ ప్రపంచకప్‌లో గాయంతోనే ఆడాడు. చీలమండ గాయాన్ని పట్టించుకోకుండా,షమీ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లతో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సమయంలో అతని కుడి పాదం నొప్పిగా ఉండేది. అయినా కూడా జట్టు కోసం గాయాన్ని భరించి సత్తా చాటాడు. వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నుంచి షమీ పునరావాసంలో ఉన్నాడు. ప్రస్తుతం గాయం నుంచి షమీ కోలుకుంటున్నాడని సమాచారం.
రెండు జట్ల స్క్వాడ్‌లు:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, రవి అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్.
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్గి, డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, మార్కో యాన్సిన్, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రెస్టన్ స్టబ్స్, కైల్ వరెన్ని, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, ఎల్ కేశవ్ మహారాజ్, కగిసో రబడా.
Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?