IND vs SA: రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 టీంలు.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

టీ 20 కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడా.. లేదా.. అన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ సందిగ్ధానికి బీసీసీఐ తెరదింపింది. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 సిరీస్ లలో భారత్ ప్రోటిస్ టీంను ఢీకొంటుంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను బీసీసీఐ ఎంపిక చేసింది.

IND vs SA: రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 టీంలు.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు
New Update

IND vs SA: ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు తొలి విదేశీ పర్యటనలో లిమిటెడ్ ఓవర్ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగబోతోంది. డిసెంబరు 10న మొదలయ్యే ఈ సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచుల్లో తలపడనుంది. ఈ మూడు ఫార్మాట్లకూ బీసీసీఐ టీంలను ప్రకటించింది. రకరకాల అంచనాల నేపథ్యంలో జట్లను ప్రకటించిన బీసీసీఐ వన్డే, టీ20 సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు

రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మూడు ఫార్మాట్లకూ ముగ్గురు కెప్టెన్లను నియమించింది. టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మ, వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్, టీ 20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తారు.

టీంల వివరాలు:
టీ20 సిరీస్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, దీపక్ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌

వన్డే సిరీస్: రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్‌, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్

టెస్ట్ సిరీస్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, షమీ (ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిధ్ కృష్ణ

ఇది కూడా చదవండి: ప్లీజ్ అప్పటివరకూ ఉండు.. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ రిక్వెస్ట్?

సిరీస్ వివరాలు:

డిసెంబర్‌ 10న తొలి టీ20

డిసెంబర్‌ 12 న రెండో టీ20

డిసెంబర్‌ 14న మూడో టీ20

డిసెంబర్‌ 17న తొలి వన్డే

డిసెంబర్‌ 19న రెండో వన్డే

డిసెంబర్‌ 21న మూడో వన్డే

డిసెంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 30 వరకు తొలి టెస్టు

జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు

#virat-kohli #rohit-sharma #bcci #ind-vs-sa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe