IND VS ENG Test Match: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 445 పరుగుల వద్ద ముగిసింది. రెండో సెషన్‌లో టీమిండియా చివరి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 131 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 112 పరుగులు చేశాడు. మ్యాచ్ రెండో రోజు, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురైల్ కూడా చిన్నదైనా చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు, ధ్రువ్ జురెల్ 46 పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు, బుమ్రా 26 పరుగులు చేశారు.
Also Read: ఫలించిన నిరీక్షణ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరితో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్
IND VS ENG Test Match: ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఒక బ్యాటర్ రనౌట్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ ,జో రూట్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ సాధించారు. ఇంగ్లండ్ తరఫున పేసర్ మార్క్ వుడ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.తడబాటు నుంచి మ్యాచ్ ను సాధించే దిశగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. నిన్న అంటే గురువారం మ్యాచ్ మొదలైన వెంటనే.. వికెట్ల పతనమూ మొదలైపోయింది. చాలా తక్కువ స్కోరుకే మూడు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టిన సంతోషం చల్లబడిపోయింది. కొత్త బంతితో ఇంగ్లాండ్ పేసర్ వుడ్.. భారత్‌ను చావు దెబ్బ కొట్టాడు. విశాఖ డబుల్ సెంచరీ హీరో జైస్వాల్(10), సెంచరీ హీరో గిల్‌ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. భారత్ ను కష్టాల్లోకి నెట్టేశాడు.
IND VS ENG Test Match:ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ తన స్టైల్ కు భిన్నంగా బ్యాటింగ్ మొదలు పెట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రావలసిన సర్ఫరాజ్ ను పక్కన పెట్టి జడేజాను రోహిత్ శర్మకు తోడుగా పంపారు. ఈ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా చాలాసేపు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు. హార్ట్లీ బౌలింగ్ లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత సర్ఫరాజ్ చెలరేగిపోవడంతో నిన్న ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది భారత్ జట్టు.
ఇక రెండోరోజు శుక్రవారం 326 ఓవర్నైట్ స్కోర్ వద్ద బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ జట్టు జడేజా దూకుడుగా ఆడడంతో మంచి స్కోర్ సాధించింది. ఈ క్రమంలో జడేజా తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం మీద ఓవర్ నైట్ స్కోర్ కు 119 పరుగులు జోడించిన భారత్ 445 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది.
Also Read: హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ