Ravi Chandran Ashwin 100th Test : ఇంగ్లండ్(England) తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా(Team India) 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో బెన్ స్టోక్స్(Ben Stokes) సారథ్యంలోని టీమ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు భారత్ ఐదో టెస్టుపై కన్నేసింది. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యేకం కానుంది. అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్టును రేపు(మార్చి 7) ఆడనున్నాడు.
ఆ సీరిసే మార్చేసింది:
భారత్ తరఫున 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన స్టార్ బౌలర్ 100వ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లండ్‌తో జరిగిన 2012 సిరీస్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు అశ్విన్(Ravi Chandran Ashwin). తాను ఎక్కడ మెరుగుపడాలో ఆ సిరీస్ తెలిసేలా చేసిందన్నాడు. 100వ టెస్టు తనకు ప్రత్యేకమైనదని చెప్పాడు. గమ్యం కంటే ప్రయాణం చాలా ప్రత్యేకమైనదని... ఇక రేపటి మ్యాచ్‌కు తన ప్రిపరేషన్‌లో ఎలాంటి మార్పు లేదన్నాడు అశ్విన్. ఇక రాజ్ కోట్ టెస్టులో 500 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు అశ్విన్. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. 132 టెస్టుల్లో కుంబ్లే 619 వికెట్లు తీశాడు.
112 ఏళ్ల రికార్డు సమం:
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాయి. మొదటి టెస్టు ఓడిపోయి మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలుచుకున్న జట్టు రెండే. రెండు జట్లు ఇలా మూడుసార్లు చేశాయి. ఆస్ట్రేలియా రెండుసార్లు, ఇంగ్లండ్ ఒకసారి ఇలా చేశాయి. 112 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ చివరిసారి ఇలా చేసింది. 1912లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా దీనిని 1897/98, 1901/02లో చేసింది. గత 112 ఏళ్లలో తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించిన తొలి జట్టుగా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
Also Read: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం