IND vs AFG: కేఎల్‌రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన బీసీసీఐ.. కేఎల్‌రాహుల్‌ని మాత్రం పక్కన పెట్టడంపై ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రేయస్‌ అయ్యర్‌ని కూడా సెలక్ట్ చేయలేదు. ఇషాన్‌ కిషాన్‌పై వేటు పడినట్టుగా అర్థమవుతోంది.

New Update
IND vs AFG: కేఎల్‌రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

అఫ్ఘానిస్థాన్‌(Afghanistan)పై జనవరి 11 నుంచి సిరీస్‌ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ టీ20 సిరీస్‌ కోసం భారత్‌ జట్టును ప్రకటించగా.. అందులో పలువురు కీలక ఆటగాళ్ల పేరు కనపడలేదు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌(KL Rahul), శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) పేర్లు లేకపోవడం ఫ్యాన్స్‌ని కన్ఫూజ్‌ చేస్తోంది. ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఫామ్‌లోనే ఉన్నారు. నిజానికి రాహుల్‌ 2022 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ పొట్టి ఫార్మెట్ జట్టులో కనిపించలేదు. రోహిత్‌, కోహ్లీ కూడా అప్పటినుంచి ఇండియా తరుఫున టీ20ల్లో పాల్గొనలేదు. అయితే రోహిత్‌, కోహ్లీని అఫ్ఘాన్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు రాహుల్‌ని మాత్రం సెలక్ట్ చేయలేదు. అయితే ఇది వేటుగా కాకుండా కేవలం రెస్ట్‌గా భావించాల్సి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అయ్యర్‌ ఎందుకు లేడు?
ఇటీవలి జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రేయస్‌ అయ్యన్ మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక ఈ క్రమంలోనే టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించాడు. అయితే తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఈ నెలలొనే ఇంగ్లండ్‌తో భారత్‌ టెస్టు సమరానికి సిద్ధం అయ్యింది. 5 టెస్టుల సిరీస్‌ స్వదేశంలో జరగనుంది. ఈ మధ్యలో జనవరి 11 నుంచి అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌లకు అయ్యర్‌ని పక్కన పెట్టారు సెలక్టర్లు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పలేదు. ఇది ఫ్యాన్స్‌ను కాస్త పజీల్‌లో పెట్టింది. టీ20లకు అయ్యర్‌ను సెలక్టర్లు కన్సీడర్‌ చేయలేదా లేకపోతే జస్ట్ రెస్ట్ ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది.

గాయాలతో ఔట్:
మరోవైపు బుమ్రాకు మాత్రం ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకోనే అఫ్ఘాన్‌ రెస్ట్ ఇచ్చారు. అదే సమయంలో పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా అఫ్ఘాన్‌ సిరీస్‌కు దూరం అయ్యారు. ఇటు ఇషాన్‌కిషన్‌ని సైతం సెలక్టర్లు పట్టించుకోలేదు. జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనుండగా.. ఈ సిరీస్‌ సెలక్షన్‌ బట్టి చూస్తే ఇషాన్‌ని టీ20 వరల్డ్‌కప్‌ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది.

అఫ్ఘానిస్థాన్‌తో టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఎస్ గిల్, వై జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్

Also Read: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు.. తారక్‌ ఫొటోలు విసిరిపడేశారు!

WATCH:

Advertisment
తాజా కథనాలు