ICC Cricket World Cup: ఐసీసీ వన్డే వరల్డ్ కప్(ICC Cricket World Cup) టోర్నమెంట్‌లో భాగంగా భారత్(Team India) తన రెండవ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో(Afghanistan) తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్‌ను ఔట్ చేయడంతో భారత బౌలర్లు మంచి ప్రారంభాన్ని అందించారు. ఆవెంటనే రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేశారు. అయితే, ఈ ఔట్ అంత ఈజీగా కాలేదు. శార్దూల్ అద్భుత క్యాచ్ పట్టడంతో గుర్బాజ్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శార్దూల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!
13 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. మొదటి బంతుల్లో 5 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత బంతిని గుర్బాజ్ బౌండరీకి చేర్చబోయాడు. అయితే, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బౌండరీ వద్ద సిద్ధంగా, డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ బౌండరీ దగ్గర నిలిచిన శార్దూల్ అద్భుతంగా క్యాచ్ పట్టి గుర్బాజ్‌ను క్రీజ్ నుంచి బయటకు పంపించేశాడు. బంతిని పట్టుకునేందుకు డైవ్ చేసి, బౌండరీ లోపల బంతి పడకుండా చాలా కష్టపడి, ఎంతో చాకచక్యంగా రెండవ ప్రయత్నంలో బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. శార్దూల్ చేసిన ఈ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా ఆప్ఘన్ ఓపెనర్లు ఇద్దరినీ 22, 21 పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపించడం జరిగింది. మొత్తానికి శార్దూల్ అద్భుతమై క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శార్దూల్ ఠాకూర్ పట్టిన క్యాచ్‌ను వీడియోలో చూడొచ్చు..
Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?