Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఇంఛార్జి ఉపకులపతుల పదవీకాలాన్ని ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంఛార్జి వీసీలు కొనసాగుతారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఇంఛార్జ్ వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంఛార్జి వీసీలు కొనసాగుతారని విద్యాశాఖ (Telangana Education Department) ఉత్తర్వులు జారీ చేసింది. పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగియడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ గత నెల 21న జీవోలు వెలువడ్డాయి. గరిష్ఠంగా నేటి వరకు ఇంఛార్జిలు కొనసాగుతారని జీవోల్లో ప్రభుత్వం పేర్కొంది.

అయితే సెర్చ్ కమిటీల సమావేశం, వీసీల నియామక ప్రక్రియ జరగకపోవడంతో ఇంఛార్జి వీసీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జేఎన్టీయూహెచ్కు బుర్రా వెంకటేశం, ఓయూకి దానకిషోర్, కేయూకి వాకాటి కరుణ, అంబేద్కర్ యూనివర్సిటీకి రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ కుమార్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీకి శైలజా రామయ్యర్, మహాత్మగాంధీ యూనివర్సిటీకి నవీన్ మిత్తల్, పాలమూరు విశ్వవిద్యాలయానికి నదీం అహ్మద్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి జయేశ్ రంజన్, శాతవాహనకు సురేంద్రమోహన్ ఇంఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.

Also Read:GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి

Advertisment
తాజా కథనాలు