రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు!

సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది.

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు!
New Update

ఒంగోలులో..!

సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. ఒంగోలు కలెక్ట‌రేట్ వ‌ద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్నారు.

ఈ ఆత్మహత్య ల పాపం జగన్మోహన్ రెడ్డి ది కాదా అంటూ రాజ్యాంగ బద్దమైన సర్పంచ్ వ్యవస్థని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని విమర్శలు గుప్పించారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆరోపించారు.

సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 600 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల కోసం ఆపడం దారుణమ‌న్నారు.

మహాత్మా గాంధీని కూడా అవమాన పరిచే విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుంద‌ని మండిప‌డ్డారు.. వైసీపీ సర్పంచ్ లు కూడా బయటకు వచ్చి గళం విప్పుతున్నార‌ని, . సర్పంచ్ ల ఆందోళనకి జగన్ ఏం సమాధానం చెబుతారు అని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జ‌న‌సేన త‌మ‌కు మిత్రపక్షమని.. ఆపార్టీతో ఇక‌పై రెగ్యుల‌ర్ గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచ‌ర‌ణ కూడా ఉంటుంద‌ని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఇప్పటికే బాధ్యతలు చేప‌ట్టిన త‌ర్వాత.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడాన‌ని చెప్పిన పురంధేశ్వరి.. త్వరంలో నేరుగా భేటీ అవుతాన‌ని అన్నారు

తిరుపతిలో..!

తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది.

గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మేమేమైనా ఉగ్రవాదులమా...? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని సర్పంచ్‌ల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలను జమచేసింది.

సర్పంచ్‌లకు కేటాయించిన నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టించారు. 13 వేల మంది సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు’’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. కాగా.. రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లోనే నేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో 50 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు లో..!

ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తుందని కామినేని, అంబికా కృష్ణ ఆరోపించారు.

గ్రామ స్వరాజ్‌ లో సర్పంచ్‌ ల పాత్ర ఏమి లేదు. సర్పంచ్‌ పదవిలో ఉన్న వారికి నిధులు లేవు, విధులు లేవని వారు విమర్శిచారు. పంచాయతీలకు నిధులు లేకపోవడంతో సర్పంచ్ లు వారి సొంత నిధులను ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం అభివృద్ధిలో చిట్టచివరి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీ అనే చెప్పవచ్చు అని పేర్కొన్నారు.

#bjp #andhrapradesh #vishnu-vardhan-reddy #janasena #purandheswari #bjp-mahadhrana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి