BJP: కవితపై విచారణ జరుగుతోంది.. ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు: లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే కవితపై విచారణ జరుగుతోందని, ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయని చెప్పారు.

BJP: కవితపై విచారణ జరుగుతోంది.. ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు: లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
New Update

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.తాను పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా చెబుతున్నా.. తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా కాళ్ల బేరానికి వచ్చినా బీజేపీ ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయా? ఆ చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు. గత ఎన్నికల్లో ఒక తప్పుడు ప్రచారంచేసి కాంగ్రెస్ లాభపడిందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు సిద్ధంగా లేరు.. వారంతా పక్క చూపులు చూస్తున్నారని, చాలామంది మాతో టచ్ లో ఉన్నారని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుక్కింది అంతా కక్కిస్తాం..
ఎన్నికల ముందు బుక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. కవితపై విచారణ జరుగుతోంది.. ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయని లక్ష్మణ్ చెప్పారు. గత ప్రభుత్వ అవినీతి మీద సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్రం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం తప్ప చర్యలు లేవని, కొట్టినట్టు చేస్తాం.. ఏడ్చినట్లు చేయండి అన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.. దీంతో తెలంగాణలో లోక్ సభలో మొత్తం స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తామని అన్నారు. రేపటి నుంచి బీజేపీ బస్సు యాత్రలు మొదలవుతాయని లక్ష్మణ్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Hyderabad: కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతితో ఎస్ఐ ప్రేమ.. ఆపై అత్యాచారం!

పిల్లల రాజకీయ భవిష్యత్తుకోసమే..
మోదీని ఓడించాలన్న ఆలోచన తప్ప విపక్షాలకు మరో ఎజెండా లేదు. కుల, కుటుంబ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఏకమయ్యాయని లక్ష్మణ్ విమర్శించారు. మోదీ దేశం కోసం పనిచేస్తుంటే, ఈ పార్టీల నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్తుకోసం, అవినీతి అక్రమాలతో దోచుకోవడంకోసం ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఈశాన్యం, దక్షిణ భారత దేశాల్లో కూడా బీజేపీని సమర్ధించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. రాజీవ్ హయాంలో ఢిల్లీ నుంచి 100 పంపిస్తే లబ్ధిదారులకు చేరింది రూ. 13 నుంచి రూ. 15 మాత్రమేనని, ఇప్పుడు జన్ ధన్ ఖాతాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోకి నగదు వచ్చి చేరుతుందని లక్ష్మణ్ అన్నారు. వికాస్ తో పాటు విరాసత్ అన్న నినాదంతో మా పార్టీ ముందుకెళ్తోందని లక్ష్మణ్ చెప్పారు.

#telangana #bjp #lok-sabha #bjp-laxman #contest-alone-in-17-seats
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe