Dhoni Sixer: అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది! 

టైటిల్ చూసి.. సిక్స్ కొడితే కొంప ఎందుకు మునిగిపోద్ది.. మీది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనుకుంటున్నారా? ఆగండి.. మీ టెన్షన్ పక్కన పెట్టి.. ఈ ఆర్టికల్ చదవండి. మీరు కూడా కచ్చితంగా ఔను.. సుమా! అని అనుకుంటారు. ఇది నిజం. 

Dhoni Sixer: అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది! 
New Update

Dhoni Sixer: భారత క్రికెట్ లో ధోనీ ఒక సంచలనం. ధోనీ సిక్స్ కొట్టాడంటే బంతి దొరకకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ధోనీ బ్యాటింగ్ లో ఉన్నంత సేపు బౌలర్ గుండె దడదడ లాడాల్సిందే. చివరిలో వచ్చి తన సిక్స్ లతో అవతలి టీమ్ టార్గెట్ ను తునాతునకలు చేయడంలో ధోనీ స్పెషలిస్ట్. అటువంటి ధోనీ కొట్టిన ఒక సిక్స్ తో చెన్నై టీమ్ ఓటమి పాలైంది. ఐపీఎల్ 2024 లో చావో రేవో అనే పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 

Dhoni Sixer: ఈ మ్యాచ్ చెన్నై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అటు బెంగళూరు గెలవాలి.. కానీ.. దానికి చాలా షరతులు కూడా ఉన్నాయి. పాయింట్ల పరంగా చెన్నై, బెంగళూరు సమానంగా ఉండడంతో.. రన్ రేట్ కీలకంగా మారింది. చివరి మ్యాచ్ లో బెంగళూరు టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో 18 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. అంటే చెన్నై ను 200 లేదా అంతకంటే తక్కువ పరుగులకే నిలువరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో చెన్నై 201 పరుగులకు చేరుకోవడానికి 17 పరుగులు అవసరం. సరిగ్గా అప్పుడు ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడు. యష్ దయాల్ బౌలింగ్ కి వచ్చాడు. యాష్ వేసిన మొదటి బంతి ఫుల్ టాస్. అంతే.. ధోనీ బ్యాట్ దెబ్బకు ఆ బాల్ 110 మీటర్ల సిక్సర్ అయింది. స్టేడియం అవతల పడిపోయింది. ఇక దొరకలేదు. దీంతో అంపైర్లు ఇంకో బాల్ తీసుకుని బౌలర్ కు ఇచ్చారు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. తరువాత ఐదు బాల్స్ లో యష్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ విజయం సాధించింది. 

Also Read: ఎన్నెన్నో అనుకుంటాం.. ధోనీ కోరిక తీరలేదు..అభిమానుల ఆశలు చావలేదు.. 

కొంప ముంచిన సిక్సర్..
Dhoni Sixer: నిజానికి మ్యాచ్ మధ్యలో ఒకసారి వర్షం పడింది. దీంతో గ్రౌండ్ కొంచెం తడిగా ఉంది. సహజంగానే బాల్ కూడా కాస్త తడి తడిగా ఉంది. ఇది బౌలింగ్‌కు కష్టంగా మారింది. దీన్ని మార్చాలని బెంగళూరు అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ, అంపైర్లు తిరస్కరిస్తూ వచ్చారు. ఇలాంటి బాల్ తో  బౌలర్ కు బాల్  పై పట్టు చిక్కదు. అందుకే, యష్ వేసిన మొదటి బాల్ కాస్త లూజ్ గా ఫుల్ టాస్ కి వెళ్లి ఉండవచ్చు. దానిని సిక్స్ బాదేశాడు ధోనీ. తరువాత బాల్ దొరకకపోవడంతో బాల్  మార్చారు. ఈసారి బౌలర్ చేతికి వచ్చిన బాల్ పొడిగా ఉంది. దీంతో.. బౌలర్ కి పట్టు దొరికింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో తరువాత ఐదు బాల్స్ వదిలాడు. అందుకే ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో చెన్నై ఓటమి పాలైంది. 

Dhoni Sixer: అర్ధం అయింది కదా.. ధోనీ సిక్స్ కొడితే.. చెన్నై మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో.. అది సరేకానీ, ధోనీ రిటైర్ అవున్నాడు.. ఇదే చివరి మ్యాచ్ అని ఇంతకు ముందు చెప్పుకున్నారు. అదే కనుక నిజం అయితే, ఎన్నో మ్యాచ్ లలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా సిక్సర్లతో మ్యాచ్ లు గెలిపించిన ధోనీ.. తన చివరి మ్యాచ్ లో భారీ సిక్స్ తో తన ప్రియాతి ప్రియమైన  చెన్నై టీమ్ ను ఓటమి పాలు చేసినట్లు అయింది. ఇదేనేమో విధి విచిత్రం అంటే!

#cricket #dhoni #ms-dhoni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe