Madhyapradesh: రెండు వర్గాల మధ్య కాల్పులు...ఐదుగురు మృతి, 6గురికి గాయాలు..!!

మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండా గ్రామంలో భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దతియా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీ నియోజకవర్గం. బుధవారం ఉదయం పశువులను పొలం నుంచి తరిమి కొట్టే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది.

Madhyapradesh: రెండు వర్గాల మధ్య కాల్పులు...ఐదుగురు మృతి, 6గురికి గాయాలు..!!
New Update

బుధవారం ఉదయం దాటియాలోని వరి పొలంలోకి పశువులు ప్రవేశించిన వివాదంపై పల్, డాంగి వర్గీయుల మధ్య వాగ్వాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో డాంగి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు, పాల్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర డజను మంది గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, సోదరుడు ఉన్నారు.

సివిల్‌లైన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెండా గ్రామంలో బుధవారం ఉదయం ప్రకాష్‌ డాంగికి అదే గ్రామానికి చెందిన ప్రీతమ్‌ పాల్‌తో తన వరి పొలంలోకి పశువులు రావడంపై వాగ్వాదం జరిగినట్లు ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. ఆ తర్వాత ఇరువర్గాల ప్రజలు తుపాకులు, ఇతర ఆయుధాలతో ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో భయ్యాలాల్ కుమారుడు ప్రకాశ్ డాంగి, అతని కుమారుడు సురేంద్ర డాంగి, సోదరుడు రాంనరేష్ డాంగి అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు, పాల్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజేంద్ర పాల్, రాఘవేంద్ర పాల్ మరణించారు.

ఇది కూడా చదవండి: G20లో విధులు నిర్వహించిన పోలీసులతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్..!!

ఈ ఘటన తర్వాత గ్రామం మొత్తం పోలీస్ క్యాంపుగా మారిపోయింది. ఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. అలాగే మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కూడా చికిత్స నిమిత్తం వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పశువుల ప్రవేశ ఘటనపై మూడు రోజుల క్రితం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని, దీనిపై రాజీకి ప్రయత్నించారని చెబుతున్నారు. కానీ వివాదం సద్దుమణగలేదు. ఈ విషయమై బుధవారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: కోట ఆత్మహత్యల అడ్డ…మరో విద్యార్థి బలి…!!

#madhyapradesh #firing #bhopal #firing-in-datiya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe