Elections: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు..తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 246 కోట్లు సీజ్

ఎన్నికల హడావుడి మొదలైంది..డబ్బుల ప్రవాహం కూడా పొంగుతోంది. దేశం మొత్తం భారీగా నగదు పట్టుబడుతోంది. దేశ వ్యాప్తంగా 45 రోజుల్లో...రోజుకు 100 కోట్లు చొప్పున 4, 500 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు 246కోట్లతో 12వ స్థానంలో ఉన్నాయి.

Elections: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు..తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 246 కోట్లు సీజ్
New Update

Money Seize: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు, నగదు, డ్రగ్స్‌, మద్యం తెగ సరఫరా అవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో రికార్డు స్థాయిలో మద్యం, డ్రగ్స్ పట్టుబడుతోంది. మార్చి1 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారుల తనిఖీల్లో రూ.4,658 కోట్లు పట్టుబడింది. ఇందులో ఏపీ రూ.125.97కోట్లతో 12వ స్థానంలో ఉంది. రూ.121.84 కోట్లతో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. గడిచిన 45 రోజుల్లో ఎన్నికల అధికారులు తనిఖీల్లో రోజుకు సగటున రూ.100 కోట్లకు పైగా పట్టుకున్నారు.

45 రోజుల్లోనే 4, 500 కోట్లు..
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూ.3,475 కోట్లు సీజ్‌ చేశారు. ఇంకా దేశంలో ఎన్నికల ప్రచారం ఊపందుకోనేలేదు... ఇప్పటికే రూ.4,658 కోట్లు పట్టుకున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఇందులో నగదు, బంగారం, ఆభరణాలు, సామగ్రి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల పంపిణీలు అనికాకుండా.. లెక్కపత్రాలులేకుండా తీసుకువెళ్లేవి కూడా పట్టుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి మరింత నగదు, తాయిలాలు, డ్రగ్స్‌, మద్యం సీజయ్యే అవకాశాలున్నట్లు ఈసీ అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన మొత్తంలో రూ.2,068 కోట్లు మాదకద్రవ్యాలు ఉన్నాయి. ఇందులో రూ.485కోట్ల డ్రగ్స్‌ ఒక్క గుజరాత్‌లో పట్టుబడ్డాయి. రూ.293 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ తో తమిళనాడు రెండోస్థానంలో ఉంది. కాగా, రూ.395.39 కోట్ల నగదు పట్టుబడింది. రూ.489.31 కోట్లు మద్యం, రూ. 562.10 కోట్లు వస్తువులు, 1,142.49 కోట్ల తాయిలాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా నగదు రూ.778కోట్లు రాజస్థాన్‌లో పట్టుబడింది. ఈ జాబితాలో రూ.125.97కోట్లతో ఏపీ 12వ స్థానం, రూ.121.84కోట్లతో తెలంగాణ13వ స్థానంలో ఉన్నాయి.

Also Read:UPSC: యూపీఎస్సీ ఫలితాల విడుదల…

#elections #seize #money #loksabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe