Pakisthan: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో.. హత్యాయత్నం చేసే ఛాన్స్ ఉందని.. అది విష ప్రయోగం రూపంలో కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

Pakisthan: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్
New Update

ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తనపై రెండుసార్లు హత్యాయత్నం చేశారని ఆరోపించగా.. తాజాగా మూడోసారి కూడా తనపై హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో.. జైల్లో తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరగొచ్చని.. అది విష ప్రయోగం రూపంలో కూడా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అధికార రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్ అడియాల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల ద్వారా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఓ సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా పాక్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్‌పై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. దేశంలో చట్టాలను పూర్తిగా అపహాస్యం చేశారని.. ఈరోజు జరుగుతున్నదంతా లండన్‌ ఒప్పందంలో భాగమేని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పరారైన వ్యక్తి.. ఓ అవినీతిపరుడని, అతడి సహాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ఇదేనని పేర్కొన్నారు. శిక్ష పడినటువంటి ఓ నేరస్థుడు క్లీన్‌ చిట్‌తో మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి ఏకైక మార్గం.. ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడమేనన్నారు. అయితే పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇటీవల స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మరోవైపు తనపై ఉన్న కేసులన్నీ బూటకమని,.. కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని అన్నారు ఇమ్రాన్. ఎన్నికలు ముగిసే దాక.. లేదా ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు తనను జైల్లో ఉంచడానికి కేసులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. అలాగే తన పార్టీ అయిన పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్ గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని, ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా.. ప్రచారాన్ని ప్రారంభించాలని తన పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తనపై ఉన్న కేసును కొట్టేయాలని, బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లనూ ఇటీవల కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

#pakisthan-news #imran-khan #pakisthan #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe