Supreme Court Warns Celebrities On Misleading Ads: సినీ తారలు, ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పలు ఉత్పత్తులను ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. పాన్ మసాలా, మందులు, బట్టలు, తదితర ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రకటనలు చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అంతేకాదు ప్రజలను తప్పు దోవ పట్టించే యాడ్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది.
పూర్తిగా అవగాహన లేకుండా ఆమోదం తెలపొద్దు..
ఈ మేరకు పలు ఉత్పత్తుల గురించి పూర్తిగా అవగాహన లేకుండా తప్పుడు ప్రకటనలకు ఆమోదం తెలపడం వల్ల ఆ ప్రభావం చాలా దూరం వెళ్తుందని గమనించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆహార రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను మే 7న కోర్టు ఆదేశించింది. ‘ప్రకటనలు ఒప్పుకునేముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బాధ్యత వహిస్తూ బాధ్యతతో వ్యవహరించడం చాలా ముఖ్యం’ అని హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indresh Malik: తల్లి ముందే నటితో రొమాన్స్.. భయంగానే అక్కడ టచ్ చేశానన్న నటుడు!
ఇక ఇటీవల యోగా గురువు రామ్‌దేవ్ మద్దతు కలిగిన పతంజలి (Patanjali ads) ఆయుర్వేదం మందులతో మధుమేహం వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్న ప్రకటనలపై కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనదారు కేబుల్ టెలివిజన్ రూల్స్, 1994 ప్రకారం స్వీయ-డిక్లరేషన్ ఇవ్వాలని, ఆ తరువాత మాత్రమే ప్రకటనలు చూపించాలని పేర్కొంది. తప్పుదారి పట్టించే ప్రకటనలు పిల్లలు, సీనియర్ సిటిజన్‌లను నేరుగా ప్రభావితం చేస్తాయని పలు కీలక సూచనలు చేసింది.