TREIPB : గురుకుల అభ్యర్థులకు కీలక అలర్ట్.. అలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్.!! తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది. By Bhoomi 22 Sep 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలకు హాజరైన అభ్యర్థులను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ( TREIPB)అలర్ట్ చేసింది. సొసైటీ , జోనల్ ప్రాధాన్యతలను స్వీకరిస్తోంది. ఇలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజక్ట్ అవుతుందని బోర్డు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్లు తుది ఆప్షన్ గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు గురుకుల బోర్డు అధికారులు సెప్టెంబర్ 20న ఈ ప్రకటన విడుదల చేశారు. ఒక్కసారి మాత్రమే ఛాన్స్...జాగ్రత్తగా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి: గురుకుల బోర్డు నిర్దేశించిన ప్రకారం అర్హత పరీక్షలు రాసిన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్స్ సమర్పించే ఛాన్స్ ఉంటుంది. బోర్డు నిర్దేశించిన తేదీల్లో ఆయనా పోస్టులకు మంజూరైన అభ్యర్థులు ముందుగా సొసైటీ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే సొసైటీ ఆప్షన్ల వారీగా ప్రాధాన్యత ప్రకారం ఆయా సొసైటీల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అదేవిధంా జోనల ప్రాధాన్యతలకు కూడా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో జోన్ల ఆప్షన్ కు అనుగుణంగా అభ్యర్థులకు ఆయా జోన్లలో పోస్టింగ్ ఇవ్వనున్నట్ల గురుకుల బోర్డు తెలిపింది. కాగా సొసైటీలు, జోన్ల ఆప్షన్స్ సెలక్షన్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒకసారి సెలక్ట్ చేసుకన్న తర్వాత వాటిని మళ్లీ సవరించేందుకు ఎలాంటి అవకాశం ఉండదని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అత్యంత జాగ్రత్తగా ఆప్షన్స్ సమర్పించాలని గురుకులాల బోర్డు తెలిపింది. ఇది కూడా చదవండి: ఏపీ సీఐడీ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ…నెక్ట్స్ ఏం జరగబోతోంది..? ఆప్షన్స్ ఇవ్వాల్సిన ముఖ్యమైన తేదీలివే: -సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు - ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( TGT) పోస్టులకు ఆప్షన్స్ ఇవ్వాలి. -అక్టోబర్ 3 నుంచి 9 వరకు - పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ డ్రాయింగ్, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ టీచర్లు ఆప్షన్స్ ఇవ్వాలి. ఇది కూడా చదవండి: మరోసారి కెనడా ప్రధాని ఆరోపణలు..భారత్ నిజనిజాలు తెలుసుకోవాలన్న ట్రూడో..!! #jobs #latest-jobs #jobs-update #treipb మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి