Children's Homework: పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రుల బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. వారి ఆరోగ్యం, సంరక్షణ మాత్రమే కాకుండా చదువుపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏ హోం వర్క్ ఇచ్చారో చూడటం, దగ్గరుండి హోంవర్క్ చేయించడం ఓ సవాల్‌తో కూడుకున్న పనే. గతంలో కేవలం పది, పన్నెండో తరగతి పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదివించేవారు. ఈ పోటీ యుగంలో ఎల్‌కేజీ నుంచి చదువు పూర్తయ్యే వరకు పిల్లలు మార్కుల వెనుక తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. రోజంతా కూల్‌గా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని ఒత్తిడి, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. పిల్లలకు ఒకటి రెండు సార్లు చెప్పినా పాఠం అర్థంకాదు, గణితం అర్థంకాక కోపం వస్తుంటుంది. ఈ కోపం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వంటి సమస్యలను తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
చైనాలో జరిగిన ఓ సంఘటన:
- కొన్ని రోజుల క్రితం చైనాలో హాంగ్‌జౌకు చెందిన 40 ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది. పిల్లలకు మ్యాథ్స్ అర్థం కాకపోవడంతో ఒత్తిడికి లోనైన మహిళకు ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీ నొప్పితో పాటు వాంతులు అయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా స్పాంటేనియస్ సబ్‌రాచ్నాయిడ్ హెమరేజ్ అనే సమస్య ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా కోపానికి, ఒత్తిడికి లోనుకావడమే కారణమని చెప్పారు.
ఒత్తిడి కారణంగా మహిళకు గుండెపోటు:
- 2019లో 36 ఏళ్ల మహిళకు గుండెపోటు వచ్చింది. చిన్నారికి గణితం బోధిస్తున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. చైనాలో ఇదే తొలి ఘటన. అయితే ఆ తర్వాత వరుసగా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. 45 ఏళ్ల వ్యక్తికి హోంవర్క్ సమయంలో ఇలానే జరిగిందని అంటున్నారు. 37 ఏళ్ల మహిళ తన నాలుగో తరగతి చదువుతున్న కుమారుడికి గణితం చెబుతుండగా ఒత్తిడికిలోనై రక్తపోటు పెరిగింది. దీంతో గుండెపోటు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
వైద్యుల సలహా:
- నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉండే మహిళలు ఒత్తిడికి గురికావొద్దని చెబుతున్నారు. పిల్లల సంరక్షణ ముఖ్యమే అయినప్పటికీ హోంవర్క్ విషయంలో అంత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదని సలహా ఇస్తున్నారు. నిదానంగా కూర్చొని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని, అవసరమైతే ట్యూషన్‌కి పంపాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి: చిలుకను ఇంట్లో ఇలా పెంచితే వద్దన్నా డబ్బే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.