Today Telangana Weather Update : తెలంగాణ రాష్ట్రం పై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఏపీలో మిచౌంగ్ తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్... తుఫాన్ గా బలహీనపడింది. తుఫాన్ అల్పపీడనగం గా మారి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇది ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ వివరించింది.
గురువారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. బుధవారం కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం బాగా కురిసింది.
అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో చలిగాలులు తీవ్రత రోజురోజుకి బాగా పెరుగుతుంది. తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. నగరంలో సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఒక్కసారిగా చలి పెరిగింది.
తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు ఇలాగే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు వివరించారు. తుఫాన్ ప్రభావంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో బుధవారం నాడు 14 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో గురువారం కూడా కొన్ని రైళ్లు రద్దయ్యాయి.
చెన్నై సెంట్రల్- హైదరాబాద్, రాయపల్లె-సికింద్రాబాద్, హైదరాబాద్- చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ను గురువారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆదిలాబాద్- హెచ్‌ఎస్ నాందేడ్ రైలును గురువారం కొన్ని కారణాలతో రద్దు చేసినట్లు అధికారులు వివరించారు.
Also read: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్!