AP-Telangana : నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

AP-Telangana : నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
New Update

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ (IMD) మరో కీలక ప్రకటన చేసింది. ఏపీ (AP), తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన చేసింది. సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains), కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది.. ఈ రెండు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతుంది. అల్పపీడనం బలపడేందుకు రుతుపవన ద్రోణులు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం వైపు పయనిస్తుందని అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని తెలిపారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వివరించారు.

మంగళవారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.

Also Read : అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు

#vijayawada-floods #andhra-pradesh-floods #telangana-floods #imd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి