/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rain-1-jpg.webp)
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రెండు మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళాఖాతం నుంచి గాలులు వీస్తున్నాయి.దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు పడగా..రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.
నగరంలో ఉదయం పూట పొగమంచుతో ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుందని అధికారులు వివరించారు. ఏపీలో (AP) ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం వల్ల 26న అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
గత రెండు రోజులుగా పడుతున్న వానల వల్ల కోత కోసిన ధాన్యం తడిసిపోతుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు. పత్తి పొలాల్లో పండించిన పత్తి కూడా కొద్దిగా తడిసింది. వరి, పంటలకు ఈ వర్షం నష్టం కలిగిస్తుండగా..కొన్ని పంటలకు మాత్రం ఆశాజనకంగా ఉంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..కేరళలో..!