Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు!

రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు!

Heat : భానుడి(Sun) భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ(Telangana) లోని హైదరాబాద్‌(Hyderabad) లో ఎండల వేడికి ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు.

రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు , చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(Oral Rehydration Solution), ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన పానీయాలను వెంట ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. ఆదివారం ఎండ ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రెండు జిల్లాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 42.6 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో 2.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4 డిగ్రీలు, మాడుగులపల్లి జిల్లా మాడుగులపల్లి మండలంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also read: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు