ఈశాన్య రుతుపవనాల వల్ల దేశంలోని ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో కేరళ, తమిళనాడు, పుదచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బుధవారం నాడు భారీ వర్ష సూచన కారణంగా పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో స్కూళ్లను, కాలేజీలను మూసివేశారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు అడపాదడపా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వివరించింది. అటు కేరళ, తమిళనాడుతో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతాలు, రాయలసీ, యానాంలో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. కాంచీపురంతో పాటు వాలాజాబాద్, ఉతిరమేరూర్, చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది.
నవంబర్ 22, 23 తేదీలలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నాగపట్నం, కాంచీపురం,చెంగల్ పట్టు జిల్లాల్లోని స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Also read: బైజూస్ కు భారీ షాక్ ఇచ్చిన ఈడీ..ఆ 9 వేల కోట్ల ఆస్తులకు నోటీసులు జారీ!