TPCC Chief Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)పై పోటీ చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి(Kamareddy)లో తాను సైతం పోటీకి సిద్ధం అని ప్రకటించారు. తానైనా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీ చేస్తామని అన్నారు. గురువారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌లను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఒకవేళ ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయకపోతే.. తానే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!
హంగ్ లేదు.. అధికారం మాదే..
ఇక తెలంగాణలో హంగ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్సే లేదన్నారు టీపీసీసీ చీఫ్. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ప్రజల హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని, ఈసారి కూడా హంగ్ వచ్చే ఛాన్సే లేదన్నారు. అవసరమైన మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమం పేరుతో ఉల్లంఘనలు..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాల పేరుతో నగదు బదిలీ చేయడాన్ని అడ్డుకోవాలని, ఏవైనా పథకాలకు సంబంధించి నగదు బదిలీలు ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు పూర్తి చేసేలా ఆదేశించాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు. అలాగే.. కొందరు అధికారులను విధుల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. రిటైర్మెంట్ తీసుకుని, అధికారం చెలాయిస్తున్న వారిని కూడా తొలగించాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు.
ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..