Hyderabad: అక్రమ గంజాయి రవాణ గుట్టు రట్టు

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

Hyderabad: అక్రమ గంజాయి రవాణ గుట్టు రట్టు
New Update

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాటిని సీజ్‌ చేశారు. అక్రమ స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలను రాజేంద్రనాద్‌ డీసీపీ మీడియాకు వెళ్లడించారు. నిబంధనలకు విరుద్దంగా గంజాయిని ఒడిశా మల్కన్‌ గిరి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిటీ శివార్లలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. గంజాయి పట్టబడిట్లు వెల్లడించారు.

స్మగ్లర్లు రెండు కార్లలో 120 కిలోల గంజాయిని తరలించే ప్రయత్నం చేశారన్నారు. మేడ్చల్‌కి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్‌, తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ ప్రేమ్ కుమార్, జాన్‌ జడ్సన్‌లు కలిసి సులభంగా డబ్బు సంపాధించాలనే దురుద్దేశంతో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. దీంతో నిందితులు ఒడిశాలోని మల్కన్ గిరికి చెందిన వెంకీ అనే వ్యక్తి వద్ద 500 రూపాయలకు కిలో చొప్పున 120 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ గంజాయిని హైదరాబాద్‌లోని పలువురికి విక్రయించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 120 కిలోల గంజాయి విలువ సుమారు 24 లక్షల రూపాయలుగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

కాగా నిందితులు చెరుకుపల్లి శ్రీకాంత్, శ్రీనివాస్ ప్రేమ్ కుమార్, జాన్ జడ్సన్‌లను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు.. ఇందులో వెంకీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ ఇది వరకే దొంగతనం కేసులో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌పై హయత్ నగర్, ఘట్‌కేసర్, మేడిపల్లి, బాలానగర్, కీసర, పటాన్ చెరువు, పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. శ్రీకాంత్‌కు జైల్లోనే తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ ప్రేమ్ కుమార్, జాన్ జడ్సన్‌లతో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు.

#illicit #hyderabad #seize #120-kgs #guttu-rattu #ravana #ganja
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe