Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ! మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు. By srinivas 25 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. మధులత కోర్సు పూర్తయ్యేవరకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో అధికారికంగా వెల్లడించింది. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని, ఇందుకు సహాయం కావాలంటూ ప్రభుత్వాన్ని సంప్రదించిన మధులతకు రేవంత్ సర్కార్ భరోసా నివ్వడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. Thanks to CM Revanth Reddy for giving 1.5 lakh check. -- Madhulatha IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని.. విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు… pic.twitter.com/CGZqrmwqbg — Congress for Telangana (@Congress4TS) July 24, 2024 హైదరాబాద్ పిలిపించిన సీఎం.. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 824వ ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలోనే ఆర్థిక సహయం కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత ఫ్యామిలీని హైదరాబాద్ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. ఇది కూడా చదవండి: Atal Setu Bridge: కారులో వచ్చి.. సముద్రంలో దూకి: వ్యాపారి సూసైడ్ వీడియో వైరల్! అలాగు మధులత కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కోసం రూ.70 వేలు, అదనంగా మరో రూ.30 వేలు ఇస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్‌రెడ్డి అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. #rajanna-sircilla #cm-revanth #badhavath-madhulata #iit-patna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి