Atal Setu Bridge: కారులో వచ్చి.. సముద్రంలో దూకి: వ్యాపారి సూసైడ్ వీడియో వైరల్! మహారాష్ట్ర డోంబివ్లికి చెందిన కురుటూరి శ్రీనివాస్ అనే వ్యాపారి అరేబియా సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి శ్రీనివాస్ దూకిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 25 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Sucide: ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి అరేబియా సముద్రంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం బ్రిడ్జ్‌పైకి కారులో వేగంగా వచ్చిన అతను కారును పక్కకు ఆపి ఒక్కసారిగా బ్రిడ్జ్ రెయిలింగ్‌పైకెక్కి సముద్రంలోకి దూకేశాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీటీవలో రికార్డ్ అవగా మృతుడి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిడ్జి పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య ముంబై - అటల్ సేతు బ్రిడ్జి మీద తన కారు ఆపి.. తర్వాత నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి pic.twitter.com/7qeGyXo0vW — Telugu Scribe (@TeluguScribe) July 25, 2024 ఈ మేరకు ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. డోంబివ్లికి చెందిన శ్రీనివాస్ కురుటూరి (38) తన కారులో నవీ ముంబై వెపు వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి బుధవారం మధ్యాహ్నం 12:24 గంటల సమయంలో కారు బ్రిడ్జిపై ఆపి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని స్థానికుల సహకారంతో శ్రీనివాస్ కోసం తీవ్రంగా గాలింపు చ్యర్యలు చేపట్టాం. వర్షం కారణంగా అలలు ఎగసిపడుతుండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని పోలీసులు చెప్పారు. ఇది కూడా చదవండి: Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ! ఇక శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని, ఎనిమిది నెలల క్రితమే స్వదేశానికి వచ్చి సొంతంగా వ్యాపారం పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. #kuruturi-srinivas #arabian-sea #committed-suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి