IIT Guwahati : గౌహతి మెడికల్ కాలేజీలో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆందోళనను రేపుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నలుగురు విద్యార్ధులు తమ ప్రాణాలను తీసుకున్నారు. నెల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులు చనిపోవడం మరింత కలవపరిచే విషయంగా మారింది. గత నెల ఆగస్టు 9న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోగా...ఇప్పుడు మరో విద్యార్థి ఇదే పనికి పాల్పడ్డాడు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ హాస్టల్ దిలో ఓ విద్యార్థి ఈరోజు చనిపోయి కనిపించారు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. దీంతో మిగతా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి స్టూడెంట్స్ ప్రాణాలు పోగొట్టుకోవడం వెనుక సంక్షేమ సహాయక వ్యవస్థల వైఫల్యం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే విషయం తెలియడం లేదని...ఇది తమకూ ఆందోళన కలిగించే విషయమేనని అంటోంది మెడికల్ కాలేజ్ యాజమాన్యం. ఈ విషయాన్ని తప్పకుండా సీరియస్‌గా తీసుకుంటామని...తగిన చర్యలు చేపడతామని అంటోంది. IITG విద్యార్థులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.
మరోవైపు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..విద్యార్థి మరణం మీద అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Also Read: Delhi: ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు–కేంద్రం నిర్ణయం