Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!!

చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

New Update
Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!!

Weight Loss Without Dieting : బరువు తగ్గడం అనగానే...ముందుగా గుర్తుకు వచ్చేది ఆహారం మానేయాలనేది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది బరువు తగ్గించే చిట్కాల(Weight Loss Tips)ను ఫాలో అవ్వాలంటే కాస్త బద్దకిస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి కేవలం భోజనం మానేయడం ఒక్కటే పరిష్కారం కాదు. ఆహారపు అలవాట్ల(Eating Habits)లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ప్రయోజనాలు పొందవచ్చు. కూరగాయలు, నిమ్మకాయ కొత్తిమీరతో చేసిన ఈ సూప్ శీతాకాలంలో బరువు తగ్గడానికి (Lose Weight In Winter)చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు డైటింగ్ లేకుండా బరువు తగ్గాలనుకుంటే ఈ సూప్(Weight Loss Soup) తాగవచ్చు. మీరు దీన్ని సులభంగా చేయవచ్చు. ఈ సూప్ యొక్క రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గేందుకు ఈ స్పెషల్ సూప్ ను ఇలా తయారు చేయండి:
బరువు తగ్గేందుకు(Weight Loss) ఈ స్పెషల్ సూప్ ను మీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇది ఉత్తమ ఎంపిక. దీన్ని తయారు చేయడానికి, మీరు ఉల్లిపాయ, బంగాళాదుంప, క్యారెట్, వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మకాయలను తీసుకోవాలి. దీనితో పాటు, ఎండుమిర్చి, ఉప్పు, దేశీ నెయ్యి మొదలైన వాటిని సూప్‌లో చేర్చవలసి ఉంటుంది. ఈ పదార్థాలన్నింటినీ తీసుకోండి.

ఈ విధంగా సూప్ తయారు చేయండి:
- ముందుగా ఉల్లిపాయ, క్యారెట్, బంగాళాదుంపలు, వెల్లుల్లి మొదలైనవాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

- ఇప్పుడు ఈ కూరగాయలను ప్రెషర్ కుక్కర్‌లో వేసి అందులో కొన్ని నీళ్లు పోయండి. కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. వాటిని ఉడికిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయండి .

-గ్యాస్ స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టండి. అందులో కొంచెం నెయ్యి వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లని వేయించండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్లు, ఇతర కూరగాయలను కూడా వేసి వేయించుకోవాలి.

-సుమారు 2 నిమిషాలు వేయించిన తర్వాత, కూరగాయలతో ఉడకబెట్టిన మిశ్రమాన్ని కలపండి. ఇప్పుడు వాటిని ఉడకనివ్వండి. రుచికి సరిపడా ఉప్పును వేయండి. మీకు నచ్చితే మిరియాలు పొడి లేదంటే ఇతర మసాలా దినుసులను కూడా కలుపుకోవచ్చు.

-చివరి కొత్తమిరీ, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ సూప్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలంలో చలిని తట్టుకోవడంతోపాటు బరువు తగ్గాలనుకునేవారికి మాత్రం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్ …ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు