OM : ఓం ను ఇలా జపిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు

ఓం అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మనసులో శాంతి, ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధనలో భాగంగా క్రమం తప్పకుండా చేసినప్పుడు ఓం జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు.

New Update
OM : ఓం ను ఇలా జపిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు

OM Chanting : "ఓం" జపించడం అనేది హిందూమతం(Hinduism), బౌద్ధమతం(Buddhism) లో పవిత్రమైన, ఆధ్యాత్మిక అభ్యాసం. ఓం(OM) తరచుగా ధ్యానం సందర్భంలో ఉపయోగిస్తారు. ఓం అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఓంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మంచి ఉద్దేశంతో ప్రారంభించండి:

  • ఓం జపించడం ప్రారంభించే ముందు సానుకూల, అర్ధవంతమైన ఒక ఉద్దేశంతో మొదలుపెట్టాలి. ఇది మనసులో శాంతి(Peace), ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. మీ కోరిక కూడా నెరవేరుతుందని పండితులు అంటున్నారు.

జపం చేసే స్థలం కూడా ముఖ్యం:

  • ఓం జపించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోవాలి, ధాన్యం చేసేందుకు ఎలాంటి డిస్టబెన్స్‌ ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. నేలపై పద్మాసనంలో కూర్చోవాలిద లేదా పాదాలను నేలపై చదునుగా ఉంచి కుర్చీలో హాయిగా కూర్చోవచ్చు. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాలను అలా వదిలేసి తొడలు లేదా మోకాళ్లపై చేతులు ఉంచాలని చెబుతున్నారు. అంతేకాకుండా కళ్లు మూసుకుని, శ్వాసను గట్టిగా తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఓం అనే శబ్ధంపై దృష్టి పెట్టాలి:

  • ధ్వనిని నెమ్మదిగా, శ్రావ్యంగా ఉచ్చరించడం ద్వారా ఓం మంత్రాన్ని జపించాలి. ప్రాసను మాత్రం ఒకే అక్షరంగా ఉచ్చరించాలి. ఉచ్చరించేటప్పుడు మీ కడుపు, ఛాతీపై దృష్టిపెట్టాలి. శబ్ధం ఛాతీ నుంచి గొంతు వరకు కదలాలి. మీరు ధ్వనిని పూర్తి చేస్తున్నప్పుడు మీ తల, పెదవులలో వైబ్రేషన్ రావాలని నిపుణులు అంటున్నారు.

పునరావృతం చేయండి:

  • ఓం అని జపించేటప్పుడు దృష్టిని శరీరంలో ధ్వని, అది సృష్టించే కంపనంపై కేంద్రీకరించాలి. స్థిరమైన, సమానమైన వేగాన్ని కొనసాగించాలి. సుదీర్ఘ ధ్యాన వ్యవధి కోసం మూడు, ఏడు సార్లు లేదా మీకు నచ్చినన్ని సార్లు జపాన్ని పునరావృతం చేయవచ్చు.

జపం చేసిన తర్వాత మౌనం పాటించండి:

  • జపం చేసిన తర్వాత ప్రకంపనలను గ్రహించి మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి కొన్ని క్షణాలు మౌనం(Silent) గా కూర్చోవాలని నిపుణులు అంటున్నారు. జపం తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. అలాగే క్రమం తప్పకుండా సాధన చేయాలంటున్నారు. ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధనలో భాగంగా క్రమం తప్పకుండా చేసినప్పుడు ఓం జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాలక్రమేణా దాని పూర్తి ప్రయోజనాలను అనుభవించడం సాధ్యమవుతుందంటున్నారు. ఓం జపించడం అనేది వ్యక్తిగత, ఆధ్యాత్మిక అభ్యాసమని, నిజాయితీ, శ్రద్ధ, దృష్టి ముఖ్యమని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : ఈ విషయాలు తెలుసుకుంటే శరీరం ఉక్కులా మారుతుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు