Mens Health: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!!

లవంగాలు తినడం పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో శృంగార సామర్థ్యాన్ని నియంత్రించే హార్మోన్. లవంగంతో మరిన్ని ప్రయోజనాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Mens Health: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!!
New Update

Mens Health: లవంగాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని సరిగ్గా తీసుకుంటే పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. టీ నుంచి వంట వరకు అన్నింటిలో లవంగాలను (cloves) ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి (Health) చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది పురుషులలో లైంగిక సమస్యలను నయం చేయడంలో కూడా సమర్థవంతమైన ప్రభావాన్ని చూపుతుంది. పురుషులకు (Mens) లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అదుపులో రక్తపోటు:

  • లవంగాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా స్టామినా కూడా పెరుగుతుంది.

టెస్టోస్టెరాన్ పెరుగుతుంది:

  • లవంగాలు తినడం పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పునరుత్పత్తి పనితీరును పెంచుతుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో శృంగార సామార్థ్యాన్ని నియంత్రించే హార్మోన్.

గొంతు నొప్పికి చెక్‌

  • లవంగం దగ్గు, గొంతునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దంతాల కింద లవంగాలను పెట్టుకోవటం ద్వారా..దాని రసం నెమ్మదిగా గొంతులోకి ప్రవేశించి నొప్పిని తగ్గిస్తుంది.

బలంగా రోగనిరోధక శక్తి

  • విటమిన్-సి, జింక్ లవంగాలలో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని లవంగాలు పెంచుతాయి.

మెరుగ్గా స్పెర్మ్ నాణ్యత

  • ప్రస్తుత జీవనశైలి కారణంగా పురుషులలో స్పెర్మ్ నాణ్యత బాగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితిలో..లవంగం స్పెర్మ్ కౌంట్, నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

ఏ సమయంలో తినాలి

  • లవంగంతో మరిన్ని ప్రయోజనాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే..ఒకటి లేదా రెండు మొగ్గలు కంటే ఎక్కువ తినవద్దని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ అలవాట్లు పాటిస్తే లైఫంతా హ్యాపీనే.. మీరు కూడా ట్రై చేయండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #cloves #mens-health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe