Health Tips : ఈ జ్యూస్ క్రమంతప్పకుండా తాగుతే..వయస్సు పెరగదు..షుగర్ రాదు..కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది..!!

క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతే ఎన్నో లాభాలున్నాయి. షుగర్ ను నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించడంతోపాటు...బరువును కూడా తగ్గిస్తుంది. నిత్యం ఈ జ్యూస్ తాగుతే వయస్సు పెరిగినా అందంగా కనిపిస్తారు.

Health Tips : ఈ జ్యూస్ క్రమంతప్పకుండా తాగుతే..వయస్సు పెరగదు..షుగర్ రాదు..కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది..!!
New Update

శీతాకాలంలో లభించే కూరగాయలు పలు రకాల మూలికా లక్షణాలను కలిగి ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఉండే అన్ని ఆహార పదార్థాల గుణాలు తెలుస్తే మీరు షాక్ అవుతారు. క్యారెట్లను చలికాలంలో పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో లేదా ఉడికించి తింటారు. క్యారెట్ శీతాకాలపు కూరగాయ అయినప్పటికీ దాదాపు ఏడాది పొడవునా లబిస్తునే ఉంటుంది. క్యారెట్ చాలా రుచిగా ఉంటుంది. పోషకమైన కూరగాయలు. క్యారెట్ లను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. క్యారెట్లను కూర రూపంలో లేదా సలాడ్ కూడా తినవచ్చు. కంటి ఆరోగ్యానికి క్యారెట్ చాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయ కంటి చూపును పెంచేందుకు సహాయపడుతుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగండి. అనేక గొప్ప ప్రయోజనాలను పొందండి.

క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పలు మూలికా పదార్థాలు ఉంటాయి. వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ప్రతిఒక్కరూ ఈ క్యారెట్ నుంచి రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తారు. వాటిలో క్యారెట్ హల్వా చాలా ఇష్టపడుతుంటారు. క్యారెట్ ను పచ్చిగా తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపునకు క్యారెంట్ మేలు చేస్తుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పదార్ధం ఉంటుంది. ఈ పదార్థం శరీరంలో విటమిన్ ఏగా మారి..కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

publive-image

క్యారెట్ త్వరగా వృద్ధాప్యాన్నినివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిగా ముఖంలో కనిపిస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగుతే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని హానికరమైన క్రిములు, వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్లు కాకుండా, ఖనిజాలు, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, మెదడు శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.

publive-image

కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ నియంత్రణలో క్యారెట్ జ్యూస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్ లోని పొటాషియం శరీరానికి చాలా ముఖ్యమైంది. క్యారెట్లో కేలరీలు, చక్కెర కూడా చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ నివారించేందుకు అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బరువును కూడా తగ్గిస్తుంది. క్యారెట్ క్యాన్సర్ ను నివారించడంలో, గుండె సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

publive-image

ప్రతిరోజూ ఒక క్యారెట్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతన్నారు. చాలా మంది ప్రజలు అన్నం లేదా సలాడ్ రూపంలో తీసుకుంటారు. క్యారెట్ ను నిత్యం ఆహారంల తీసుకుంటే అనేకు ప్రధాన వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

publive-image

ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాను ముంచెత్తిన భారీ వర్షాలు..వరదల్లో చిక్కుకున్న వేలాది మంది ప్రజలు..!!

#carrot-health-benefits #carrot #cholesterol #blood-sugar #lifestyle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe