Bihar CM Nitish Kumar : జేపీ గంగా పథ్ ప్రాజెక్టు (Ganga Path Project) లో భాగంగా పట్నా (Patna) లోని గయా ఘాట్ నుంచి కంగన్ ఘాట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మూడో దశ పనులను బీహార్ సీఎం నీతీశ్ కుమార్ (CM Nitish Kumar) ప్రారంభించారు. ఈ క్రమలో ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న అధికారులు ప్రాజెక్టు వివరాలు, పనులు జరుగుతున్న తీరుపు ఆయనకు వివరించారు. అయితే వాటిపై నితీష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే లాభం లేదని.. పనలు ఏడాది లోపల పూర్తి కావాలని వారిని అడగారు. అదే క్రమంలో అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటా..తొందరగా పనులు ఏయండి అంటూ ముందు వచ్చి నమస్కరించబోయారు. దాంతో అక్కడునన వారంతా అవాక్కయ్యారు. అదే వేదిక మీద ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ ఛౌదరీ, విజయ్‌కుమార్‌తో పాటు స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్‌లు ఉన్నారు.
సీఎం నితీశ్ చేసిన పనికి కంపెనీ ప్రతినిధి స్టన్ అయిపోయాడు. సర్ అలా చేయకండి అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగతావారు అంతా కూడా ఆయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. నితీశ్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితోనూ ఇలాగే చేశారు.