Health Benefits: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి శీతాకాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, జలుబు, దగ్గు ఇలా అనేక ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. ఆస్తమా రోగులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేతే ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు. By Vijaya Nimma 12 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Health Problems: ఇక చిన్న పిల్లలపై శీతాకాలం చాలా ప్రభావం చూపుతుంది, ఎన్నో రకాల వైరస్‌లు విరుచుకుపడతాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు చిన్నారులను ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. చలికాలంలో ఎక్కువశాతం జలుబు, గొంతునొప్పి, చెవినొప్పి, జ్వరం పిల్లలకు వస్తూ ఉంటాయి. అందుకే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించాలని వైద్యులు అంటున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేందుకుప్రయత్నించాలి. వారి ఉష్ణోగ్రతను కాపాడేందుకు తలకు టోపీలు, సాక్సులు, తేలికపాటి స్వెట్టర్లు, జాకెట్లు వేస్తే మంచిది. బయట ఉష్ణోగ్రతను బట్టి శిశువు చాతి, తలను బాగా కప్పిఉంచాలి. అలాగే చలికాలంలో చిన్నారులకు ఎప్పుడూ ప్యాంట్లు వేస్తే మంచిది. ఇది కూడా చదవండి: పండగ రోజు ఇల్లు గుల్ల.. అమలాపురంలో దొంగల బీభత్సం తియ్యగా ఉన్న ఆహార పదార్థాలు తినిపించకూడదు. అధికంగా తీపి పదార్థాలుతింటే జలుబు, దగ్గు, జ్వరం తొందరగా వ్యాపిస్తాయి. చలికాలంలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లు సొకే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని బాగా పెంచుకోవాలి, పెద్దలతో పాటు పిల్లలకు కూడా రోగనిరోధకశక్తి పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, కొన్ని రకాల మసాలా దినుసులు తింటే రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. అలాగే చిన్న పిల్లలకు నిద్రపోయేందుకు తగినంత అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి బాగా పెరగాలంటే.. చిన్నారులకైతే నిద్ర ఎంతో అవసరం. ఎందుకనగా తగినంత నిద్ర రోగ నిరోధక వ్యవస్థపై సానుకూలంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి బలపడుతుందని, ఆ తర్వాత శరీరాన్ని బలహీన పరుస్తుందని చెబుతున్నారు. అలాగే చలికాలం భోజనం అనంతరం పిల్లల ఆరోగ్యంలో శారీరక శ్రమ ముఖ్యమైనది. అందుకే వాతావరణం చల్లబడక ముందు ప్రతిరోజు సాయంత్రం ఒక గంటపాటు మైదానం లేదా పార్క్‌లో ఆడుకోవడానికి మన పిల్లలను తీసుకెళ్లాలి. పిల్లల రోగనిరోధక శక్తి బాగా పెరగాలంటే తినడానికి ముందు చేతులను శుభ్రంగా కడగాలి, అంతేకాకుండా ఆట వస్తువులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. #children #health-benefits #health-problems #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి