Kejriwal : విపక్ష కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే...దేశం పేరునే మార్చేస్తారా?

జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు.

New Update
Kejriwal : విపక్ష కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే...దేశం పేరునే మార్చేస్తారా?

జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ వేయించడంపై రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దేశం పేరు మార్పుపై రాజకీయ చర్చ షురూ అయ్యిది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగుతోంది. జి20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపించిన ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పందిస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు.

కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ...ఇలా అన్నారు. దేశం పేరును ఎవరైనా ఎలా మార్చగలరని అన్నారు. G20 ఆహ్వానంపై భారత రాష్ట్రపతికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వ్రాశారు. కూటమికి భారత్ అని పేరు పెడితే దేశం పేరునే మార్చుతారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు భారత్‌గా మారుద్దాం.తర్వాత భారతదేశం పేరు కూడా మారుస్తాం, తర్వాత భారత్ పేరును బీజేపీగా మారుస్తాం.ఇది చాలా తమాషాగా ఉంది, ఈ దేశం 140కోట్ల మంది ప్రజలది. ఏ ఒక్కపార్టీ స్వంతం కాదు. ఈ పేరు పెడితే నాలుగు ఓట్లు పోతాయని బీజేపీ ఫీలవుతోంది. ఓట్లు తగ్గుతాయి కాబట్టి భారతదేశం పేరు మార్చండి, ఇది దేశానికి ద్రోహమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు తగ్గకూడదనే ఇలా చేస్తుందని ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: బానిస పేరు నుండి దేశం విముక్తి పొందింది…!!

నాతో కూర్చున్న వ్యక్తి కూడా సనాతన ధర్మానికి చెందిన వాడు. మీలో చాలా మంది సనాతన ధర్మాన్ని అనుసరించేవారు కూడా ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం మనం ఒకరి మతాన్ని గౌరవించుకోవాలి అని అన్నారు.

ఇక ఆప్ నేత రాఘవ్ చద్దా కూడా బీజేపీపై ఫైర్ అయ్యారు. ఒక దేశం ఒక రాజకీయపార్టీకి చెందినది కాదన్నారు. జి20 సమావేశం ఆహ్వానం పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోనూ పలు అనుమానాలు తావిస్తోందన్నారు. దేశం పేరు మార్పు వివాదాస్పదంగా మారుతుందన్నారు. ఇష్టానుసారంగా దేశం పేర్లు మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు