Bike Stunts: బైక్ పై స్టంట్స్ చేస్తే తోలు తీస్తాం!

ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Bike Stunts: బైక్ పై స్టంట్స్ చేస్తే తోలు తీస్తాం!
New Update

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో స్ట్రీట్ స్టంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆకతాయిల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకపై అలా జరగొద్దని, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ (Radha Raturi) స్పష్టం చేశారు. రవాణా శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ట్రాఫిక్ డైరెక్టరేట్ విభాగాల అధిపతులతో సోమవారం జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. రోడ్డు ప్రమాదాల గురించి ప్రధానంగా సమావేశంలో చర్చ జరిగింది. అందుకు కారణం ఆకతాయిలు అని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. బీఎండబ్ల్యూ, హార్లీ డేవిడ్ సన్ 8 బైక్స్ కొనుగోలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇందుకోసం రూ.1.68 కోట్ల వ్యయం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రాడార్ స్పీడ్ సైన్ బోర్డ్స్, కెమెరాలు పది ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.74 లక్షలు వ్యయం చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు సులభంగా అమలు చేసే వీలు కలుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గల ప్రమాదకర మూల మలుపుల వద్ద 147 కుంభాకార అద్దాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.9.55 లక్షల వ్యయం చేస్తారు. ట్రాఫిక్ పోలీసుల భుజాలపై అమర్చేందుకు 1243 షోల్డర్ లైట్లు కూడా కొనుగోలు చేస్తారు. పోలీసుల కోసం బాడీ వేర్ కెమెరాలను కొనుగోలు చేస్తారు. ఇందుకోసం రూ.14.76 లక్షల ఖర్చు చేస్తారు.

Also Read: విద్యార్థితో టీచర్‌ లైంగిక సంబంధం.. చివరికి

#police #uttarakhand #bike-stunts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe